తమ బాస్ కు చెందిన కొన్ని కంపెనీలపై మాట్లాడిన రఘువీరా తన కంపెనీల గురించి ఎందుకు మాట్లాడరు? అప్పుడు ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది  వైసీపీ ప్రశ్న. కానీ తానే నిజం అని చెబుతున్నారు రఘురామ.. ఈ కథ తేలేలా లేదు.. గతంలో ఇలాంటి వివాదస్పద వ్యవహారాలు మాట్లాడుకుంటే పోయేవి ఇప్పుడు సామరస్య పూర్వక ధోరణి ఇరువర్గాల్లోనూ లేదు అని పొలిటికల్ ఎనలిస్టుల భావన.తాను తప్పు చేయనప్పుడు  తాను నిందను భరించలేనప్పుడు బెయిల్ పిటీషన్ పై జరుగుతున్న వాదనలకు అంటెండ్ కావొచ్చు గా అని రఘురామ అనే ఎంపీ అంటున్నారు..  అబద్ధాల జైత్రయాత్రలో  జగన్  ఉన్నారని తానే నిజం అని చెబుతున్నారాయన. రాష్ట్రంలో ఆయన సచ్ఛీలతను నిరూపించే క్రమంలోనే తాను బెయిల్ పిటీషన్ కు సై అన్నానని కూడా చెప్పారు. ఇలా చాలా మాటలు ఢిల్లీ వేదికగా అన్నారు. అవి ఇప్పుడు మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి. అయితే రఘు రామ కూడా చాలా తప్పులు చేశారని అవి ఏంటో అందరికీ తెలుసునని, ఆయన బ్యాంకులకు ఉద్దేశ పూర్వ ఎగవేతదారుగా ఉన్నారని, రుణాల చెల్లింపునకు సంబంధించి ఆయన ప్రవర్తించే తీరు అందరికీ తెలుసు అని అంటున్నారు మరోవైపు వైసీపీ నాయకులు.. ఈ గేమ్ ఇలానే కొనసాగితే మరికొంత కాలం విసుగు తప్ప వినేవాళ్లకు కానీ చూసే వారికి కానీ ఇదెంత మాత్రం వినోదం కాదు కాబోదు కూడా...


 

రఘు రామ జగన్ తల్లి రాసిన పుస్తకం గురించి కూడా మాట్లాడారు. పనిలో పనిగా ఆ పుస్తకంలో ఆమె ప్రస్తావించిన మాటలూ  చెప్పారు. ఇలా ఎప్పటిలానే ఆయన తన కోపం అంతా చూపించారు. ఇప్పుడు బీజేపీ రఘురామ వైపు ఉంటుందా లేదా ఏపీ సీఎం వైపు ఉంటుందా అన్నది కీలకం. ఎందుకంటే సాయి రెడ్డి నిన్నటి వేళ ఆర్ ఆర్ ఆర్ విషయమై నిర్మలా సీతారామన్ కలిసి పరిస్థితి వివరించారు. మరి! అనర్హతకు సంబంధించిన చర్చలు ఏ మేరకు కొలిక్కివచ్చాయన్నది తేలాలిక.. కానీ కేంద్రం వీటిని చూడడం మినహా చేసేదేమీ లేదని కూడా తేలిపోయింది. ఐటీ దాడులను సైతం ఎదుర్కొన్న రఘురామ బీజేపీని నమ్ముకుంటే ఫలితం ఉండదన్న విషయం గ్రహించలేకపోతున్నారన్నది విశ్లేషకుల మాట..ఆయనొక పొలిటికల్ పార్టీ కనుసన్నల్లో ఉండి పనిచేయడం ఆధారాలతో సహా ఆయన దొరికిపోవడం అన్నవి జరిగాయి కనుక ఆయనే చెప్పేవి చేసేవి అన్నీ అబద్ధాలే అన్నది వైసీపీ మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: