బై పోల్ వస్తే చాలు బీజేపీ నాయకులకు వణుకు వస్తోంది.. మాటలూ ఎత్తి పొడుపు మాటలూ సూటిపోటి మాటలూ చలోక్తులూ ఎలా ఉన్నా సభల నిర్వహణ, ఎన్నికల వేళ పోల్ మేనెజ్మెంట్ అన్నవి బయటకు చెప్పుకోలేని ఆర్థిక భారాన్ని మిగులుస్తున్నా యి. జిల్లాలలో పార్టీ బలోపేతానికి కార్యకలాపాలకు స్థానిక నాయకులే చూసుకుంటారు. కానీ అన్ని వేళలా బీజేపీ నాయకులు చురుగ్గా ఉండేందుకు సరిపడినంత ఫండ్ పార్టీ ఇస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకం. కొన్ని జిల్లాలలో కార్యాలయాల నిర్వహణ కూడా బీజేపీకి అవసరం లేకున్నా టీఆర్ఎస్ పై పట్టుకోసం ఏమయినా చేయాలన్న తాపత్రయంలో వాటిని నడపాల్సి రావొచ్చు.. ఈ క్రమంలో అధికారంలో ఉండగానే సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలని తలపోస్తోంది బీజేపీ. రాజధాని హైద్రాబాద్ మాదిరిగా
బిల్డింగులు కొన్నయినా జిల్లా కేంద్రాలలో కొనుగోలు చేయాలని అప్పట్లో ఓ సూచన కూడా చేసింది. ఆ మేరకు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ దీటుగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకో లేదా మీడియా మీట్ లు ఏర్పాటుచేసేందుకు ఒక కార్యస్థానం దక్కుతుంది.. మరి! ఈ బైపోల్ కాస్ట్ రెండు వేల కోట్లు అని తేల్చారు కొందరు.,. అంత కాకున్నా అంతలో కొంతయినా బీజేపీ ఖర్చు చేయక తప్పదు.. ఇన్నింటిని రాజేందర్ తట్టుకోగలరా?


 
 
సుదీర్ఘ కాలం మనుగడ సాగించేందుకు బీజేపీకి భవిష్యత్ కావాలి..సుదీర్ఘ కాలం పార్టీ ఆఫీసులు నడిపి తమ సత్తా చాటేలా నా యకులు కావాలి.. సుదీర్ఘ కాలం ఆర్ ఎస్ ఎస్ భావజాలంకు అనుగుణంగా పనిచేసే స్థానిక నాయకులు కావాలి.. ఇలా చాలా కావాలి.. అయితే ఈ స్థితి తెలంగాణ  పార్టీ విభాగాలకు లేదు.. ఆ మాటకు వస్తే బండి సంజయ్ కు ఉన్న ఆర్థిక బలం ఏంటన్నది కూడా మరి కొద్ది రోజులకే తేలిపోతుంది.. పార్టీ ఫండ్ అందితే నడిపేంత స్థాయి ఉన్న నాయకులే అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఉన్నారు..  ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నికల ఖర్చుకు యాడ నుంచి నిధులు తెస్తరో అన్నది ఓ కీలక సమస్య.. ఇప్పటికే దుబ్బాక ఖర్చు అంతా రఘునందన్ ఖాతాలో చేరిపోయింది. అమిత్ షా లాంటి వారి ఊతం ఉంటే ఉండవచ్చు గాక కానీ ఎక్కువ శాతం ఆర్థిక భారం రఘునందన్ దే కావొచ్చు అని ఓ సమాచారం.. ఇప్పుడు ఈటెల ఖర్చు చేసే స్థాయి ఉన్న వ్యక్తే కానీ మిగిలిన రోజుల్లో పార్టీ ఉనికికి నడకకూ ఆయనంత ఊతం ఇస్తారన్నది కీలకం కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp