తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విషయంలో 2014 నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న సమయంలో బలహీనంగా ఉన్న సమయంలో కూడా ఈ సోషల్ మీడియా అనేది తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ లో చాలా వరకు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉత్సాహంగా పని చేసినా సరే వారిని కొన్ని పరిస్థితుల వలన కలగడం అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా విభాగాలకు నాయకులను ప్రకటించారు.

అయితే ఈ నియామకాన్ని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. కొంతమందికి పదవులు రావటం మరికొంతమందికి పదవులు రాకపోవడం అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పార్టీ గుర్తించలేదు అభిప్రాయాలను కొంతమంది వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా ప్రధాన సమస్యగా మారిపోయింది. చాలా మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా పార్టీకి సంబంధించి పెడుతున్న పోస్టులు కూడా డిలీట్ చేసే పరిస్థితి ఏర్పడింది.

గతంలో సి బి ఎన్ ఆర్మీ అనే ఒక వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థకు సంబంధించిన వారిని మళ్లీ పదవులకు ఎంపిక చేశారని కొంతమంది సోషల్ మీడియా లో ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా దీని పై పెద్ద దుమారమే చెలరేగింది. టిడిపిలో దాదాపుగా ఉత్సాహంగా పని చేసే కార్యకర్తలు ఎక్కువగానే ఉన్నా సరే వారికి సరైన ప్రోత్సాహం లభించకపోవడం కాకుండా ఇటువంటి పరిణామాలు వారిని వెనక్కి లాగుతున్నాయి కొంతమంది సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమస్యల మీద పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి పదవులు రాని వారికి నచ్చ చెప్పాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp