రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పార్టీలో చాలా మంది నాయకులకు ఆయనకు మధ్య విభేదాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా ఆయన గత కొన్ని రోజులుగా పార్టీని బలోపేతం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడం ఇష్టంలేని కొంతమంది నాయకులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా తెలంగాణలో కొన్ని మీడియా ఛానల్స్ ప్రసారాలు చేస్తున్నాయి.

అయితే ఇందులో ఎవరు రాజీనామా చేస్తారా ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా సమాచారం ఇచ్చారని ప్రచారం మొదలైంది. తమకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉండే అవకాశం లేదని భావిస్తున్న ఇద్దరు సోదరులు రేవంత్ రెడ్డి తో భవిష్యత్తులో తమకు ఇబ్బందులు ఉంటాయని అంచనా వేసుకుని పార్టీ మారిపోవడానికి రెడీ అవుతున్నారని పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళ్లిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వారు కొంతమంది వద్ద వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయనకు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే బీజేపీ లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి ఆయన కుదరకపోతే పదవి ఏంటి అనే దానిపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. పార్టీలో ఉన్న ప్రాధాన్యత దక్కే అవకాశం లేదు కాబట్టి రాజీనామా చేయడమే మంచిది అనే అభిప్రాయంలో అన్నదమ్ములు ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: