ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తర్వాత కొంతమంది కీలక నాయకులు కాస్త ఇబ్బంది పడుతున్నారు అని ప్రచారం ఎక్కువగా జరిగింది. రాజకీయంగా కాస్త భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో చాలా మంది నాయకులు మంత్రి పదవులు రాకపోయినా సరే పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం కొంత మంది సీనియర్ ఎంపీలు కేంద్ర మంత్రివర్గంలో చోటు రాకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై సీరియస్ గా ఉన్నారని అవసరమైతే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా రెడీ అవుతున్నారని కొందరు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక సీనియర్ నేత పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం లేదని సీనియర్ నాయకులు కూడా ఆయన అందుబాటులో లేరని సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు అని తెలుస్తోంది. రెండు దశాబ్దాలుగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సదరు నేత కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం 2014 నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్న సరే ఇప్పటి వరకు కనీసం తన పేరును కూడా పరిశీలించకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారని వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

రాజకీయంగా పార్టీ బలంగా ఉండటంతో ఉత్తరప్రదేశ్ లో ఆయన కూడా 2,3 జిల్లాల్లో కీలక పాత్ర పోషించారు. కనీసం తనకు సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం అదేవిధంగా రాష్ట్రంలో కూడా తనకు ప్రాధాన్యత తగ్గించడంతో ఇప్పుడు సదరు సీనియర్ నేత పార్టీలో ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయని, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశాలు ఉన్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన కోపం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp