తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అనే దానిపై చాలామంది టీ-కాంగ్రెస్ నేతలకు స్పష్టత రావడం లేదు. రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ ఆంధ్ర నాయకుల చేతుల్లో ఉంది అనే అభిప్రాయం చాలామందిలో కలుగుతుంది. రాజకీయంగా పార్టీ కోసం అన్ని విధాలుగా కష్టపడిన కొంతమంది సీనియర్ నాయకులను పక్కన పెట్టడం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో కాస్త కఠినంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉండటంతో చాలా మంది సీనియర్ నాయకులు పార్టీకి దూరం జరిగే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి.

అగ్ర నేతలు గా ఉన్న వాళ్లు కూడా రాజకీయాల నుంచి తప్పుకోవడం లేకపోతే వేరే పార్టీ లోకి వెళ్లి కీలక పదవులు వస్తే అక్కడ బాధ్యతలు నిర్వహించడం వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నారని ప్రచారం మొదలైంది. రాజకీయంగా పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని భావిస్తున్న క్షేత్రస్థాయి నాయకత్వం కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లేదా టిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తోందని లేకపోతే షర్మిల పార్టీలోకి వెళ్లేందుకు కూడా రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సరే తనకు ప్రాధాన్యత లభించే అవకాశం లేకపోవడంతో బీజేపీలో తనకు సన్నిహితంగా ఉండే ఒక నాయకుడి ద్వారా  ఎమ్మెల్యే  సంప్రదింపులు జరుపుతున్నారని బండి సంజయ్ తో మాట్లాడి చెప్పాలని తన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ఎమ్మెల్యే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఆయన ఎమ్మెల్యే అయినా సరే తన సూచనలు సలహాలను పార్టీ అధిష్ఠానం గానీ రాష్ట్ర కాంగ్రెస్  పార్టీ నాయకులు గానీ తీసుకోవడం లేదని అదే విధంగా పార్టీలో పదవుల విషయంలో కూడా తనకు ప్రాధాన్యత లేదని ఆయన కన్నీటి పర్యంతమైనట్టుగా కూడా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: