తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత ఆ పార్టీ నాయకులకు కూడా లేదు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కచ్చితంగా సీఎం కేసీఆర్ ను గద్దె దించాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి పక్కన పెడుతున్నారు అని ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో కొంతమంది నాయకులు కూడా భయపడుతున్నారు అని ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. భవిష్యత్తు విషయంలో వారిలో కాస్త ఆందోళన ఉంది అనే మాట కూడా ఉంది.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుందని పార్టీ మారి పోతా అని గత కొన్ని రోజులుగా చెప్తున్న ఒక మాజీ మంత్రికి ఒక కీలక నేత నచ్చ చెబుతూ వస్తున్నారని.. అయినా సరే ఆయనకు ఇప్పటి వరకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదు అని కనీసం జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయనకు ఇవ్వలేదని దీంతో పార్టీలో ఉన్నా సరే ఎటువంటి ఉపయోగం లేదు అనే అభిప్రాయానికి వచ్చేశారు అని అంటున్నారు.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించిన సరే కొన్ని కారణాలవల్ల ఆయనను పక్కన పెట్టారని.. ఎమ్మెల్సీ అడిగినా సరే ఆయనకు ఇవ్వలేదని దీనితో పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. నచ్చ చెప్పడానికి రెడీ అయిన ఒక సీనియర్ నేతను ఆయన కాస్త దురుసుగా పక్కన పెట్టారని నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఇన్ని రోజుల నుంచి కబుర్లు చెబుతూ వచ్చావని కాబట్టే తాను పార్టీలో ఉండలేను అని చెప్పినట్లుగా సమాచారం. అయితే ఈ విషయం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలిసినా సరే ఈ అంశంలో ఆయన పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: