కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న పుణ్యక్షేతం తిరుమల యాత్రకు ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తుంటారు. అందులో సగానికి పైగా ఆర్టీసీ బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేల మందితో రద్దీగా ఉండే తిరుపతి బస్ స్టేషన్ ను మరింత ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి బస్టాండ్ ను తయారు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం 112 అంతస్తుల్లో బస్టాండ్ నిర్మించేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ లో తిరుపతి పట్టణానికి వచ్చే వారి కోసం ప్రత్యేక డార్మిటరీ, హోటల్, వసతి సహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మిస్తున్నారు. భక్తులు తిరుపతి బస్టాండ్ లోనే సేద తీరి.. నేరుగా వెంకన్న దర్శనం చేసుకునేలా ఆర్టీసీ ప్లానింగ్ సిద్ధం చేస్తోంది.

తిరుమల కొండపై పర్యావరణాన్ని కాపాడేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకున్నట్లు సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు, ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన 50 బస్సులను తిరుమల డిపోకు కేటాయించామన్నారు. మొత్తం వంద బస్సుల్లో 50 బస్సులను మాత్రమే ఇతర ప్రాంతాలకు కేటాయిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు... ఆర్టీసీపై డీజిల్ భారం కూడా బాగా తగ్గిపోతుందన్నారు. తిరుపతి ఆర్టీసీ డిపో అభివృద్ధికి భారీ ప్రణాళిక రూపొందించామన్నారు. ఆర్టీసీ ఎంపీ. కరోనా కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. అన్ని ఏసీ బస్సులను శానిటైజ్ చేస్తున్న విషయాన్ని ద్వారకా తిరుమల స్పష్టం చేశారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే బస్సుల్లోకి  అనుమతిస్తున్నామన్నారు. థర్డ్ వేవ్ కరోనా హెచ్చరికల నేపథ్యంలో అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ తో పాటు డిజిల్ ధక పంపు కూడా ఆర్టీసీకి ప్రస్తుతం పెనుభారంగా మారిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: