తెలంగాణ ముఖ‌చిత్రం మారుస్తాం..ఫ‌లానా ప‌నితో ఫ‌లానా అభివృద్ధి సాధ్యం అని చెప్తే జ‌నం న‌మ్మ‌రు..అందుకు త‌గ్గ ఆచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది కూడా చెప్పండి..మీకు ఉన్నంత విజ‌న్ ఇత‌రుల‌కు లేద‌ని అనుకుంటే ఎలా? అని ప్ర‌శ్నిస్తున్నారు ష‌ర్మిల ను టీఆర్ఎస్ నాయకులు. ఏడున్న‌రేళ్లలో లేని ప్రేమ ఇప్పుడెందుకు.. అలానే ఎన్న‌డూ లేని ఈ స‌మ‌స్యల ప్ర‌స్తావ‌న ఇప్పుడెం దుకు? మా కొట్లాట‌ను ప‌రిష్క‌రించేందుకేనా మీ దీక్ష‌లు లేదంటే మీకు అధికారం ద‌క్కేందుకేనా ఈ ప్ర‌యాస అంటూ గులాబీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. వీటిపై ష‌ర్మిల ఏం చెబుతారో?
 


ఉద్యోగాలు లేవు..టీపీసీసీ అనుకున్నంత బాగా ప‌నిచేయ‌లేదు..రాజ‌న్న రాజ్యంలో ఇవేవీ ఉండేవి కాదు అని ష‌ర్మిల చెబుతూ ని రుద్యోగుల క‌న్నీళ్ల‌కు బ‌దులు చెప్పండి అంటూ టీఆర్ఎస్ నాయ‌కుల‌ను నిల‌దీస్తుండ‌డం ముఖ్యంగా వార్త‌ల్లో క‌నిపిస్తున్న దృశ్యం. కానీ ఇంత‌కాలం అక్క ఏమ‌యి పోయారు..ఇంత‌కాలం అక్క‌కు తెలంగాణ ఎందుకు గుర్తుకురాలేదు..నిరుద్యోగుల గురించి ఆత్మ‌హ త్య‌లు చేసుకున్న యువ‌త గురించి ప్ర‌శ్నిస్తున్నారు స‌రే! మీవంతు అధికారం అన్న మాట ఎత్త‌కుండా ఏమ‌యినా చేయొచ్చుగా అని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. పార్టీలు నెల‌కొల్ప‌డం క‌న్నా యువ‌త‌కు చేయూత‌నిచ్చే ఉపాధి కేంద్రాలు పెడితే బాగుండు క‌దా అని కూడా స‌ల‌హా ఇస్తుంది. కేవ‌లం రానున్న ఎన్నిక‌ల్లో ఇక్క‌డ  ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తను త‌మ‌కు అనుగుణంగా మార్చుకోవ డం మిన‌హా ష‌ర్మిల చేసేది ఏమీ లేద‌ని తేల్చి చెబుతున్నారు కొంద‌రు టీఆర్ఎస్ నాయ‌కులు.


తెలంగాణ‌లో బ‌ల‌మ‌యిన ప్ర‌తిప‌క్షం గొంతుకలుగా కాంగ్రెస్,బీజేపీ తో స‌హా ఇంకొన్ని పార్టీలూ ఉన్నాయి కానీ ష‌ర్మిల తాను అవేవీ ప‌ట్టించుకోన‌ని అవ‌న్నీ త‌న శత్రువులేన‌ని, తానే నిఖార్సైన తెలంగాణ వాదిన‌ని చెబుతున్నారు. ఆ క్ర‌మంలో ఆమె దీక్ష‌ల‌కు సైతం ముందుంటున్నారు. ఇవాళ న‌ ల్గొండ‌లో నిరుద్యోగ దీక్ష‌కు ఆమె కూర్చొన్నారు. రాష్ట్రంలో ఖాళీ గా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం కృషి చేయాల‌న్న‌ది ఆమె డిమాండ్. ఇదే మాట మొన్న కేసీఆర్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెప్పిన‌ప్పుడూ ప్ర‌స్తావించారు. ఇలా ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఆమె నిరుద్యోగుల ప‌క్షానే ఉంటున్నామ‌ని అంటున్నారు.కానీ వీళ్లు నిజంగా తెలంగాణ వాదులేనా అన్న‌ది టీఆర్ఎస్ ప్ర‌శ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: