విశాఖ విండో : అంతా అవంతి మాటే..


ఇవాళ విశాఖ న‌గ‌ర పాల‌క సంస్థ‌కు సంబంధించి స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక జ‌రిగింది. త‌గినంత బ‌లం ఉన్న కార‌ణంగా ఊహించిన రీతిలోనే అక్క‌డా వైసీపీనే నెగ్గింది. మొత్తం ప‌ది మంది స‌భ్యుల‌తో కూడిన ఈ స్టాండింగ్ క‌మిటీ చైర్ ప‌ర్స‌న్ గా మేయ‌ర్ వ్య‌వ‌హ‌రి స్తారు. ఈ ఎన్నిక‌ల్లో భాగంగా ప‌లు ఆస‌క్తిదాయ‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా క‌థ‌నంతా అవంతినే న‌డి పారు. అంతా తానే అయ్యారు. వాస్తవానికి ఈ ఎన్నిక‌లే కాదు ప్ర‌తి చోటా విశాఖ కేంద్రంగా న‌డుస్తున్న రాద్ధాంతానికి, సిద్ధాంతానికి సింహ భాగం బాధ్య‌త అటు సాయి రెడ్డి ఇటు అవంతి శ్రీ‌ను తీసుకోవ‌డం విశేషం. అనూహ్యంగా గంటా శ్రీ‌ను సైలెంట్ అయిపోవ‌డం అవంతికి బాగానే క‌లిసి వ‌చ్చింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోయి, ఆ పార్టీ లో అంతా తానై ఉన్న‌విధం గా క‌థ‌ను న‌డ‌ప‌డం గంటా నేర్పిందే ఈ అవంతికి కావొచ్చు అని కొంద‌రు ప‌రిశీల‌కులు అంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ గురువు వ్యూహాత్మ‌క నిశ్శ‌బ్దం అవంతికి బాగానే ప్ల‌స్ పాయింట్ అయింది. సాయి రెడ్డి కూడా అవంతికి కాస్తో కూస్తో ప్రాధాన్యం ఇస్తున్నార‌నే తెలుస్తోంది..కొన్ని నిర్ణ‌యాలు మాత్రం మంత్రి ప్ర‌మేయం లేకుండానే అమ‌లు అయిపోతున్నా, ఎన్నిక‌ల విష‌య‌మై మాత్రం అవంతి సేవ‌లు వాడుకుంటున్నారు సాయి రెడ్డి అన్న‌ది సుస్ప‌ష్టం. ఏదేమైన‌ప్ప‌టికీ అవంతి జ‌న‌సేన‌ను తిట్ట‌డంలోనూ, ప్ర‌జా ఉద్య‌మాల‌ను హేళ‌న చేయ‌డంలోనూ అవంతి ఎప్ప‌టికప్పుడు ముందుంటార‌ని టాక్.. అదే ఇవా ళ నిజం కూడా.. మాకు మేమే పోటీ మాకు మేమే సాటి అని డైలాగ్ ఒక‌టి మాత్రం వినిపిస్తున్నారు. ఆ విధంగా ప‌వ‌న్ డైలాగ్ ను త‌మ‌కు అనుగుణంగా మార్చు కుని ముందుకు దూసుకుపోతున్నార‌ని,. కానీ ఆయ‌న కానీ సాయి రెడ్డి కానీ విశాఖ‌కు చేసిందేమీ లేద‌ని జ‌న‌సేన పెద‌వి విరు స్తోంది. ఇక స్టాండింగ్ క‌మిటీ విష‌యానికి వ‌స్తే ఈ ఎన్నిక‌ల‌కు టీడీపీ దూరంగా ఉండాల‌నే అనుకుంది కానీ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపి తరువాత ఓటింగ్ కు దూరం అయింది.. దీనిపై కూడా అవంతి కామెంట్స్ పాస్ చేశారు. టీడీపీ త‌మ‌కు ప్ర‌త్య‌ర్థి కానేకాద‌ని తేల్చేశారు. వైసీపీకి వైసీపీనే పోటీ అని పునః స్ప‌ష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: