ఒక పేద వాడికి కావాల్సినది ఏంటి? తిండి, గుడ్డ, గూడు.. ఈ మూడు ఉంటే చాలు ఇంకేమి అవసరం లేదు. పేదవాళ్లు కూడా అదే కోరుకుంటున్నారు. అంతకుమించి ఇంకేమి అవసరం లేదు.ఎక్కువ కోరుకోరు. ఇక ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడేమయ్యాయి. ఆయన్ని నమ్మి ఎంతోమంది పేద వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు. కాని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు.పేద వాళ్లకి ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇళ్ళు కట్టిస్తాం ఇంకా అన్ని రేట్లు తగ్గిస్తాం అని ఆయన చెప్పారు.అలాగే రైతులని ఆదుకుంటాం అన్నారు. కాని అవన్నీ ఒట్టి మాటలేనా.. నిజాలు కావా.. 

ఇక సొంత్తిల్లు అనేది ప్రతి మనిషి కల. కల అనేది పక్కన పెడితే.. సొంత్తిల్లు అనేది పేదవాడికి అత్యవసరం. డబ్బులున్నోడు ఇల్లులు కట్టుకుంటాడు. కాని పేద వాళ్ళ పరిస్థితి ఏంటన్న జగనన్న.. చాలా మంది ఇల్లులు లేక రోడ్డున పడుతున్నారు.. మధ్య తరగతి ప్రజలు ఇంటి అద్దెలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు.. తెగ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చావు.. బాగుందన్న.. కాని పేదవాడు ఆ పట్టాలు ఏం చేసుకుంటాడు చెప్పన్నా.. ఒక ఇల్లు కట్టిస్తే అందులో తల దాచుకొని నా అన్న ఇల్లు కట్టించాడు అని జీవితాంతం నిన్ను గుర్తు పెట్టుకుంటాడు. ఈ రోజుల్లో ఇల్లు..చిన్న గుడిసె కాని పెంకుటిల్లు కాని కట్టుకోవాలన్న మినిమమ్ లక్షకు పైనే ఖర్చవుతుంది.డబ్బు వున్నవాడు చాలా ఈజీగా కట్టించుకుంటాడు. కాని లేనివాడి పరిస్థితి ఏంటి.. నిన్ను నమ్మి నిన్ను గెలిపించిన పేదవాడి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించన్న జగనన్న..నేటికీ ఎంతోమంది సొంతిల్లులు లేక.. అద్దె ఇంట్లో ఉండి అద్దెలు కట్టలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి నీ గుండెతో ఆలోచించన్నా..పేదవాడు రోడ్డున పడే దుస్థితి నుంచి కాపాడన్నా..

మరింత సమాచారం తెలుసుకోండి: