ఏపీలో క్యాబినెట్‌లో 25 మంత్రులు ఉన్నారనే విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని దూసుకెళుతున్న జగన్‌కు మంత్రులు ప్లస్ అవుతున్నారా? అంటే కరెక్ట్‌గా ఏది చెప్పలేని పరిస్తితి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేయగా, ఈ రెండేళ్లలో ఎంతమంది అదిరిపోయే పనితీరు కనబరుస్తూ, ప్రజలకు సేవ చేస్తూ, సీఎం జగన్‌కు అండగా ఉంటూ, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు? అంటే ఏదో కొద్దిమంది మాత్రమే మంచి పనితీరు కనబర్చారని చెప్పొచ్చు.

జగన్ క్యాబినెట్‌లో కొత్తగా మంత్రులైన వారు ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నవారు ఉన్నారు. మరి వీరిలో మెరుగైన పనితీరు ఎవరు కనబరుస్తున్నారు? అంటే కొందరు మాత్రమే తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, ప్రజలకు సేవ చేస్తూ, ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడంలో ముందున్నారని చెబుతున్నారు. వారి వల్ల జగన్ ప్రభుత్వానికి కాస్త అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు.

కానీ కొందరు మంత్రులు సరైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని, వారికి ఈసారి రీప్లేస్ తప్పనిసరి అంటున్నారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే...ఏపీలో ఏదో రాజకీయం తెలిసినవారికి తప్ప, సామాన్య ప్రజలకు కొందరు మంత్రులనే సంగతి కూడా తెలియదని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఏ శాఖకు ఎవరు మంత్రిగా ఉన్నారో కూడా తెలియదని అంటున్నారు.

అసలు ఫలానా శాఖకు మంత్రి ఎవరు? అంటే చాలామంది చెప్పలేని పరిస్తితి ఉంది. ఆఖరికి చదువుకున్నవాళ్లకు సైతం మంత్రుల గురించి పెద్దగా అవగాహన లేదని తెలుస్తోంది. దీని బట్టి చూస్తే ఏపీలో కొందరు మంత్రుల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే అలాంటివారిని సీఎం జగన్, ఈసారి పక్కకు తప్పించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోలేని మంత్రులకు జగన్ పక్కనపెట్టనున్నారని అంటున్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమ శాఖలపై పట్టు తెచ్చుకోకుండా, మంచి పనితీరు కనబర్చకుండా ఉన్న మంత్రులని పక్కనబెట్టడం ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: