రాజకీయాలు అవకాశాలు బట్టే జరుగుతాయనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఉండే అవకాశాలు బట్టే, నాయకులు ముందుకెళ్తారు...పార్టీలు మారతారు. ఇక అవకాశాల కోసం పార్టీ మారే నాయకులు ఏపీలో ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు రాజకీయ జంపింగులు సహజమే. అధికారం, అవకాశమే బట్టే రాజకీయ నాయకులు ముందుకెళ్తారు. అయితే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి అధికారం కోల్పోయిన టీడీపీకి చాలామంది నాయకులు హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అలా అధికారం కోల్పోగానే టీడీపీ నేతలు వైసీపీ, బీజేపీల్లోకి జంప్ కొట్టారు. అయితే ఏపీలో బీజేపీకి ఎలాంటి పరిస్తితి ఉందో చెప్పాల్సిన పని లేదు గానీ, కేంద్రంలో అధికారంలో ఉండటంతోనే కొందరు నాయకులు ఆ పార్టీ వైపుకు వెళ్లారు. కాకపోతే మొదట్లోనే ఆ పార్టీలోకి వలసలు జరిగాయి గానీ, ఆ తర్వాత వైసీపీ గేట్లు ఓపెన్ చేయడంతో నేతలు అటు వెళ్ళిపోయారు.

ఇక ఇక్కడ వైసీపీలోకి వెళ్ళిన నాయకులు గురించి పక్కనబెడితే, బీజేపీలోకి వెళ్ళిన నాయకులు పరిస్తితి మాత్రం రాజకీయంగా పెద్దగా బాగోలేదనే చెప్పొచ్చు. ఏదో రాజకీయంగా సేఫ్‌గా ఉంటామని చెప్పి కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లారు. అయితే ఏపీలో బీజేపీ పరిస్తితి ఘోరంగా ఉందనే చెప్పొచ్చు. ఇక్కడ ఆ పార్టీకి ఏ మాత్రం ఉనికి లేదు. మరి అలాంటి పార్టీలోకి వెళ్ళిన కొందరు టీడీపీ నాయకులు, మళ్ళీ తిరిగి అదే పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాలు తర్వాత పలువురు రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కొందరు సేఫ్ సైడ్‌గా బీజేపీలోకి వెళ్లారు.

మళ్ళీ ఆ నాయకులు తిరిగి సైకిల్ ఎక్కడం గ్యారెంటీ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పైగా టీడీపీ-బీజేపీల పొత్తు ఉండేలా కనిపించడం లేదు. అలా అని బీజేపీలో ఉంటే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అందుకనే వచ్చే ఎన్నికల్లో పలువురు నాయకులు టీడీపీలోకి రిటర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: