తెలంగాణ రాజకీయాల్లో  కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడున్నర సంవత్సరాల నుంచి కెసిఆర్ ఎలాంటి మార్పులు లేకుండా  ఏకధాటిగా  పాలిస్తూ వస్తున్నాడు. మిగతా పార్టీలన్నింటినీ కట్టిపెట్టి, ప్రతిపక్ష నేతలను సైతం టిఆర్ఎస్ లో చేర్చుకున్నాడు. ఆ పార్టీలోకి  ఏ వ్యక్తి వచ్చినా చేర్చుకోవడం తప్ప  బయటకి పోవడం అనేది తెలియదు. కానీ టీఆర్ఎస్ పార్టీకి మొదటిసారి  దుబ్బాక ఎలక్షన్ లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ షాక్ తో  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ విజయం సాధించింది. తదుపరి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ కే పట్టంకట్టారు. ఈ తరుణంలోనే  బిజెపి పార్టీకి  మంచిరోజులు వచ్చాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గెలుపొందడం  ఆయన  దూకుడు రాజకీయంతో  దుబ్బాక ఎలక్షన్లలో విజయం సాధించడం ఇక తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ మాత్రమే ఉంటాయ్ అనుకున్న తరుణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఏడున్నర సంవత్సరాల నుంచి చతికిలా పడుతూ వస్తున్న కాంగ్రెస్  టిపి సిసి గా దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడంతో ఆయన తనదైన శైలిలో మార్కు రాజకీయం చేస్తున్నారు. పాత నేతలందరినీ కలుపుకొని పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఈ తరుణంలోనే బిజెపి పార్టీకి చాలా మంది లీడర్లు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అటు  టిఆర్ఎస్ పార్టీని వీడిన టువంటి ఈటల రాజేందర్ బిజెపిలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు. ఈ తరుణంలోనే  ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  తన ఐదేళ్ళ సర్వీస్ ఇంకా ఉండగానే  రాజీనామా చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన రాజీనామాతో  ఆయన హుజురాబాద్ లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారని వదంతులు వచ్చాయి. వాటన్నింటిని తిప్పికొట్టి  తన నిర్ణయాన్ని చెప్పేసారు ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంలోనే ఆయన ఇతర పార్టీలపై తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. దళిత జెండాను మనం ఎగురవేయాలని, దళితులంతా ఏకం కావాలని అనగారిన వర్గాలకు రాజకీయంగా మార్పు రావాలని ఆయన కోరుతున్నారు.

దాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన  ఆగస్టు 8వ తేదీన  బిఎస్పి పార్టీ లో చేరి తెలంగాణ బిఎస్పికి  నూతన అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వనున్నాడు. ఆగస్టు 8 రోజునే నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు కూడా చేస్తున్నాడని సమాచారం. ఈ విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో బలపడే అవకాశం ఎక్కువగా ఉందని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే  ఆయన స్థాపించినటువంటి స్వేరో సంస్థ, గురుకులాలు  ఆయన ఆలోచనతోనే చాలా ముందుకు పోయాయి. దేశంలోనే మంచి  పేరు తెచ్చుకున్నాయి. ఈ విధంగా ఎంతోమందిని  మేధావులను చేసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ విధంగా తన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే తను రాజకీయాల్లో కీలకంగా ఉండాలనే ఆలోచనతోనే  బీఎస్పీ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: