కరోనా అన్ని రకాలుగా దెబ్బ తీసింది. కరోనా అన్ని దేశాలను దెబ్బ తీసింది.. కరోనా అన్ని వర్గాలనూ దెబ్బ తీసింది. కరోనా అందరి ఉపాధినీ దెబ్బ తీసింది.. నిజమే.. ఇలా ప్రపంచ ఆర్థిక రంగం మొత్తాన్ని ప్రభావితం చేసే విపత్తులు చాలా అరుదుగా వస్తుంటాయి. కరోనా అన్ని దేశాల్లాగానే ఇండియాను కూడా బాగా ప్రభావితం చేసింది. మొదటి వేవ్‌ ఇండియాపై అన్ని దేశాల్లాగానే ప్రభావితం చేసినా.. సెకండ్ వేవ్ మాత్రం చుక్కలు చూపించింది.


ఆక్సిజన్ కొరత, మందుల కొరతతో ఇండియా సెకండ్ వేవ్‌లో అల్లాడిపోయింది. రోజూ వేల సంఖ్యలో మరణాలు భారత పరువును గంగలో కలిపాయి. విచిత్రం ఏంటంటే.. ఇంతగా ఇబ్బంది పడిన తర్వాత కూడా ఇండియా వేగంగా కోలుకుంటోంది. తాజాగా ప్రపంచ బ్యాంకు వెల్లడించిన కొన్ని గణాంకాలు ఇండియాకు ఊరట కలిగిస్తున్నాయి. ఈ ఏడాది భారత్ 12శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు గతంలో వేసిన అంచనాను 9 శాతానికి పరిమితం చేస్తూ సవరించింది. అంటే మన వృద్ధి రేటును దాదాపు 3 శాతం తగ్గించింది.


మరి మన వృద్ధి రేటు తగ్గిస్తే ఇండియాకు ఊరట ఎలా అంటారా.. ఎందుకంటే.. వృద్ధి రేటు తగ్గించినప్పటికీ మిగిలిన దేశాలతో పోలిస్తే అదే అత్యధిక వృద్ధి రేటు. అంటే కరోనా తర్వాత ఒక దేశం 9 శాతం వృద్ది రేటు సాధించడం కూడా గొప్ప విషయమే అంటోంది ప్రపంచ బ్యాంకు. అభివృద్ధి చెందుతున్న ఏ దేశంలోనూ కరోనా తర్వాత కూడా ఇంతటి ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంకు ప్రకటించలేదు. అంతే కాదు.. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనా 6 శాతంగా ఉంది.


అంటే ఇండియా కరోనా బారిన పడినప్పటికీ దాని నుంచి వేగంగా కోలుకుంటోందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అంతే కాక.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరి ఇది ఇండియాకు ఊరట కలిగించే వాస్తవమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: