తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా జోరు మీద ఉన్నదనీ చెప్పొచ్చు. హుజురాబాద్ లో నేతల మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలోకి వెళ్లిపోతాడో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ను వీడి పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ కారు  ఎక్కాడు. ఇలా నేతలంతా  ఏ పార్టీలో చేరుతారో అర్థంకాని పరిస్థితిలో హుజురాబాద్ ఉప ఎన్నిక  జరుగుతోంది. టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన  ఈటల రాజేందర్ బిజెపి పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

అయితే ఈ ఎన్నికను  ఈటల రాజేందర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రాంతంలో గెలిస్తే ఆయన టిఆర్ఎస్ పార్టీపై గెలిచినట్టే, ఈ తరుణంలోనే కెసిఆర్ కూడా  ఎలాగైనా ఈటెల రాజేందర్ హుజురాబాద్ లో ఓడించాలని కంకణబద్ధులై ఉన్నారు. దీంతో ఈటెల  అనుచరులు అందరిని ఒక్కొక్కరుగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఈటెలకు దెబ్బతీయాలని రాజకీయాలు కూడా చేస్తున్నారు అని అర్థం అవుతోంది. రాజేందర్ ముఖ్య అనుచరులు కొంతమంది బిజెపికి రాజీనామా చేశారు. ఈయన అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన భార్య జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి రాజేందర్ కు షాక్ ఇచ్చారు. మేమంతా టిఆర్ఎస్ గుర్తుపై గెలిచామని, టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని  కోటి,స్వప్న ప్రకటించడం చాలా విడ్డూరం. దీంతోపాటుగా ఇటీవల ఈటల  ముఖ్య అనుచరుల్లో ఒక్కరైనా బండ శ్రీనివాస్ కూడా ఈటలకు  షాక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

 ఈ నేపథ్యంలోనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండ శ్రీనివాసన్ సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  2021లో టిఆర్ఎస్లో చేరారు. టిఆర్ఎస్  మండల శాఖ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్ పని చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అక్కడి రాజకీయం వేడెక్కుతోంది. అక్కడ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈటలను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు టిఆర్ఎస్ వర్గాలు. ఇలా ఈటెల పై విజయం సాధించేందుకు కెసిఆర్ ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: