కరోనా వైరస్ మన ఇండియాకి వచ్చి ఇంకా మనల్ని వదిలి వెళ్ళలేదు. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది అనేక రకాలుగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇది ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. నగరాల్లోని అన్ని ఐటీ కంపెనీలు లాక్ డౌన్ కారణంగా మూతవేయబడిన విషయం తెలిసిందే. కానీ కంపెనీ పనులను మాత్రం ఆపలేదు. ఉద్యోగుల ఇంటి నుండే తమ విధిని నిర్వహించడానికి అనుగుణంగా మార్పులు చేసింది. కొన్ని ప్రదేశాలలో అయితే ఇంటి స్థలాలలను ఆఫీసులుగా మార్చిన సందర్భాలున్నాయి. కాబట్టి ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త రకపు విదానానికి బాగా అలవాటు పడిపోయారు. ఒకవైపు పని చేసుకుంటూనే, ఇంట్లో వారితో కలిసి ఉండచ్చు కాబట్టి, ఈ విధానం పట్ల ఉద్యోగులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.  
అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి కరోనా నెమ్మదిగా తన తీవ్రతను తగ్గించుకుంటోంది. త్వరలోనే అన్ని ఐటీ కంపెనీలు తమ విధివిధానాలను తిరిగి ఆఫీసుల నుండి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఉద్యోగులు ఖచ్చితంగా వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.  ఇటీవల ప్రపంచ ఆర్ధిక ఫోరమ్ కోసం ఇఫ్ఫోస్ చేసిన సర్వే ప్రకారం దాదాపుగా మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులు వారి పనిని ఇంటి  నుండే చేయాలని అనుకుంటున్నారట.  ఈ సంస్థ మొత్తం 29 దేశాలలో ఉన్న 12,500 ఉద్యోగస్తులను సర్వే చేసి పలు విషయాలను సేకరించింది. ఒకవేళ కంపెనీ యాజమాన్యాలు ఖచ్చితంగా కార్యాలయం నుండే పనులు చేయాలనే నిబంధన కనుక తీసుకువస్తే 30 శాతం మంది ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం వెతుక్కుంటారని ఈ సర్వే తెలిపింది.

 ఇంతకు ముందు నిపుణులు ఇంటి నుండి పని చేయడం వలన ప్రొడక్టివిటీ తగ్గుతుంది అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం వారి అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుండి పని చేయడం వల్లనే చాలా ఫ్రీగా ఎక్కువ వర్క్ ను చేయవచ్చని తెలిపింది. ఈ విధమైన పని మార్పుకు ఎంతో మంది మద్దతు తెలుపుతున్నారు. మళ్ళీ వారానికి అయిదు రోజులు పని దినాలు కావాలని కొన్ని దేశాల ఉద్యోగులు కోరుకుంటున్నారు, వాటిలో ఇండియా కూడా ఉంది. అయితే చైనా బెల్జియం మరియు ఫ్రాన్స్ దేశాల ఉద్యోగులకు ఇంటి నుండి పని చేయడం ఇష్టం లేదని తెలుస్తోంది. వీరు 1.9 రోజులు మాత్రమే వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నట్లు సర్వే తెలిపింది. కానీ మన ఇండియాలో ఉద్యోగులు వారానికి 3.4 రోజుల పాటు పనిచేయడానికి ఇష్టంగా ఉంటారు. అయితే ఉద్యోగుల కోరికలకు అనుగుణంగా ఈ కంపెనీలు వ్యవహరిస్తాయా ? లేదా ఖచ్చితంగా ఆఫీస్ కు రావాల్సిందే అనే నిబంధనను తీసుకువస్తాయా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి: