ఆప‌రేష‌న్ రేవంత్

ఎన్న‌డూ లేనంత గా పీసీసీలో మార్పు వ‌స్తోంది. ఇంత‌కాలం వినిపించిన బూజు పట్టిన సిద్ధాంతాలకు సంబంధిత పోక‌డ‌ల‌కు ఇప్పుడిక కాలం చెల్లింద‌నే అనుకోవాలి. రేవంత్ దిగువ స్థాయి కార్య‌క‌ర్త‌ల‌లో త‌న‌దైన శ‌క్తి నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది ఫ‌లితం ఇస్తే కేసీఆర్ ను ఢీ కొనే ప్రబ‌ల శ‌క్తిగా కాంగ్రెస్ ఎద‌గ‌డం ఖాయం. కొన్ని త‌ప్పులు దిద్దుకుని స‌హేతుక విమ‌ర్శ‌కు ప్రాధాన్యం ఇస్తే ఆయ‌న మ‌రిన్ని విజ‌యాలు ద‌క్కించుకోవ‌డం త‌థ్యం. ద‌ళిత దండోరాకు ఎలానూ పిలుపు ఇచ్చారు క‌నుక ఈ ప్రొగ్రాం స‌క్సెస్ అయితే త‌మ కోసం న‌డిచే నాయ‌కుడు ఒక‌రున్నార‌ని వారికో  ఓ భ‌రోసా ద‌క్కుతుంది.. ఆ విధంగా ద‌ళిత ఓట్లు ఇటుగా ప‌డేలా చేయొచ్చు. ఇక ప్ర‌జా సంఘాలతో ఎలానూ పోరాటం చేస్తున్నారు క‌నుక వారికీ కాస్త ప్రోత్సాహం ఇస్తే కొన్ని  స‌మ‌స్య‌ల విష‌య‌మై రాజీ లేని పోరాటం కాంగ్రెస్ తో క‌లిసి చేసేందుకు అవ‌కాశం ఉంది..అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్న ద‌ళిత నాయ‌కుల‌కూ ఇదే ప్రోత్సాహం ఉంటే వాళ్లూ మ‌రింత బాగా ప‌నిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మ‌రోవైపు ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసే కీల‌క సామాజిక వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు రేవంత్ ఇంకాస్త ప‌నిచేయాలి..అలాంట‌ప్పుడే ఆశించిన ప్ర‌గ‌తి సాధ్యం.. ఎలానూ జెండా మోసే కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని చెబుతున్నారు క‌నుక అది ఏ మేర‌కు ఫ‌లిస్తుంద‌న్న‌ది

వేచి చూడాలి.


కీల‌క మార్పు :  ప‌రిణామాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ రేవంత్..పేరు ఓ విధంగా మార్మోగిపోతోంది. ఇంత‌కాలం క‌ద‌లిక లేని టీపీసీసీలో క‌ద‌లిక వ‌చ్చింది. ఆ విధంగా తెలంగాణ‌లో వినిపిస్తున్న వాదం.. నినాదం ఇదే.. ఆయ‌న అన్ని పార్టీల తోనూ ట‌చ్ లోనే ఉంటున్నార‌ని, త‌న‌వైపు తిప్పు కునేందు కు కీల‌క నేత‌ల‌తో సంప్ర‌తింపులు చేస్తున్నార‌ని వినిపిస్తున్న స‌మాచా రం. ఒక‌నాడు కాంగ్రెస్ ని వీడిన పెద్ద‌లంతా ఇప్పు డు రేవంత్ కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్క‌డంతో వెన‌క్కు వ‌చ్చేస్తున్నారు. అదేవిధం గా కార్య‌క‌ర్త‌లంతా రేవంత్ తో న‌డిచేలా చేస్తున్న కార్యాచ‌ర‌ణ కూడా ఫ‌లించేలా ఉంది. అధికారం ఊసు ఎలా ఉన్నా ఈ సారి కాంగ్రె సు చెప్పుకోద‌గ్గ స్థానాలు తెచ్చుకోవ‌చ్చు. ఇక రేవంత్ త‌న‌దైన పంథాలో ఎంఐఎంనూ త‌న‌వైపు  తిప్పుకునే ఛాన్స్ ఉంది. ఇంత‌కా లం టీఆర్ఎస్ కు బీటీం గా ఉన్న ఎంఐఎం రేప‌టి వేళ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకూ వెనుకంజ వేయ‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల కులు అంటున్నారు.  జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను వేగవంతం చేసి క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల‌లో ఉత్తేజం నింపితే రేవంత్ మ‌రింత ప్ర‌భావ‌క శ‌క్తిగా ఎద‌గ‌గ‌ల‌ర‌న్న‌ది విన‌వ‌స్తున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: