కాంగ్రెస్ పునర్నిర్మాణానికి రాహుల్ గాంధీ సిద్ధమయ్యాడన్నది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సీనియర్ నేతలు తన సహకారం అందించకపోవడంతో కాడి ఎత్తేసిన రాహుల్.. అది వ్యూహాత్మకంగా చేశాడని ఇప్పుడే మనకు అర్థమ వుతుంది. అంతకు ముందు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీనియర్లను అడిగి తీసుకునేవాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ మొత్తం గాడి తప్పిపోయింది. దీంతో విసుగు చెందినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. దీంతో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే  సోనియా గాంధీ రాహుల్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టు సమాచారం.

 దీంతో రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు అన్నింటిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ లో వెంటవెంటనే జరుగుతున్న మార్పులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మార్పు కూడా తెలంగాణ నుంచే మొదలైందని చెప్పవచ్చు. సీనియర్ లు ఎంతోమంది ఎన్ని అడ్డంకులు పెట్టినా, అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఫైనల్ గా  పార్టీని బతికించిన వారికి మాత్రమే  పార్టీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకొని రేవంత్ రెడ్డికి టీ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాడు. సీనియర్లు అందరినీ కలిసి కూల్ చేశాడు. దీంతో రేవంత్ రెడ్డి  ఒక 15 రోజుల్లోనే  తెలంగాణలోని పరిస్థితులు అన్నింటిని తనకనుకూలంగా మార్చుకున్నాడు. ఇదే తరహాలో పంజాబ్ లో కూడా  ఫార్ములా ఉపయోగించాడు రాహుల్ గాంధీ. ఫైర్ బ్రాండ్ అయినటువంటి  సిద్దూకి టీ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇది వర్కౌట్ అవుతుందా.. అన్నదే సందేహంగా మారింది. కీలక విషయం ఏంటంటే  పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కు సిద్ధూకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నది. వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో సాగుతున్న వివాదం చాలా పిక్ స్థాయికి చేరుకుంది.  సీఎంపై సిద్దు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు 80 సంవత్సరాలు అమరేందర్ సింగ్..  ఇప్పటికి పార్టీని తన కనుసన్నల్లోనే నడిపించు కోవాలని చూస్తున్నాడని విమర్శలు  వస్తున్నాయి. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో రాహుల్ సిద్దును లైన్ లోకి తీసుకున్నారని సమాచారం. ఆయనకు టిపిసిసి ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన కూడా ఇదే అని తెలుస్తోంది. ఏది  ఏమైనా  రాహుల్ గాంధీ మాత్రం కాంగ్రెస్ లో భయపడే వ్యక్తులకు ఉండే అవకాశం లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. దీని అర్థం  సీనియర్లు ఆలోచన లేని వారు పార్టీకి అవసరం లేదని బయటకు వెళ్ళిపోమని చెప్పకనే చెప్పాడు. పార్టీకి  యువ రక్తం కావాలని ఆలోచనతో  ముందుకు వెళుతున్నారని  అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: