తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దూసుకువస్తున్న ఆంధ్ర ఆడబిడ్డ  ఇక్కడ ప్రభావం చూపగలదా.  కనీసం వార్డు నెంబర్ స్థాయి నేతలు కూడా  ఆమె పార్టీ వైపు చూడటం లేదు. కార్యకర్తల బలం, నేతల బలం లేకుండా షర్మిల  కనీసం ఎమ్మెల్యే అయినా గెలవగలదా..దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. దీనిపై తాజాగా ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించగా.. చాలా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టి దూసుకొస్తున్న వైయస్ షర్మిల  విమర్శలు పంచ్ డైలాగులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీ అయిన టిఆర్ఎస్  ప్రతిపక్షాలను టార్గెట్ చేసి  తమదైన శైలిలో మాటలతో ముందుకు పోతున్నారు. షర్మిల ఎంత బలంగా పైకి వస్తున్న కానీ ఆమె పరివారం మాత్రం చాలా బలహీనంగా ఉందని చెప్పొచ్చు.

తెలంగాణపై  దండయాత్ర మొదలు పెట్టిన షర్మిల తన వెనుక ఉండేటటువంటి  కార్యకర్తలు మాత్రం తయారు చేసుకోవడం లో వెనుకబడి పోతుందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఎక్కడ యుద్ధం చేయాలి అన్న రాజో, రానో ఉంటే సరిపోదు. దాని వెనుక అపారమైన పరివారం ఉంటేనే మనం యుద్ధంలో గెలవగలం. తెలంగాణ రాజకీయాలు దూసుకువస్తున్న  షర్మిలకు సైతం అదే లోటు కనబడుతుంది. షర్మిల పైకి ఎంత బలంగా కనిపిస్తున్న  ఆమె వెనక బాడీగార్డులు తప్ప, పట్టుమని పదిమంది బలమైన నేతలు కూడా లేరు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలు అవుతున్న  సర్పంచి స్థాయి నేత కూడా ఆమెను నమ్మి పార్టీలోకి రావడానికి ఒప్పుకోవడం లేదు. ఎమ్మెల్యే స్థాయి నేతలు అయితే ఆ పార్టీని పార్టీ లాగా కూడా చూడడం లేదు. ఇటీవల టీపీసీసీ రేవంత్ రెడ్డి షర్మిల  తనపై చేసిన కామెంట్లకు ఘాటుగా బదులిచ్చారు. ఆమెను కూరలో కరివేపాకులా తీసేశారు. అసలు షర్మిల పెట్టింది రాజకీయ పార్టీ కాదని, ఎన్జీవో సంస్థ అని అందువల్ల షర్మిల వాక్యాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదని రేవంత్ రెడ్డి గాలి తీసేసారు. తెలంగాణ సమాజం నేతలంతా ఇప్పటికీ షర్మిలను ఆంధ్ర ఆడబిడ్డ గానే చూస్తూ, తెలంగాణ బిడ్డగా చూడకపోవడమే  పార్టీకి నష్టం జరగడానికి  కారణం అవుతుందని  అంటున్నారు.

ఈ మధ్యకాలంలో తెలంగాణలో షర్మిల బలం ఎంత..? ఆమె ఎమ్మెల్యేగా గెలవగలదా..? అనే అంశంపై  తుపాకీ.కం ఆన్ లైన్ పోల్ సర్వే నిర్వహించింది. దీనిపై జనాలు  తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. 70.48 శాతం మంది  తెలంగాణలో షర్మిల ఎమ్మెల్యేగా గెలవదని, 24.58 శాతం మంది  గెలుస్తుందని సమాధానం  ఇచ్చారు. 4.98 శాతం మంది  ఇప్పుడే ఏం చెప్పలేం అంటూ ఎటూ తేల్చలేక పోయారు. ఏది ఏమైనా  పార్టీని నడిపించాలి అన్న, ముందుకు తీసుకు పోవాలన్నా, ఆ పార్టీకి పునాది లాంటి కార్యకర్తలు ఎంతో అవసరమని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: