మాయ‌ను న‌మ్ముకున్నావా నాయ‌నా భ‌లే


ఇవాళ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ రాజ‌కీయ అరంగేట్రం పెద్ద చ‌ర్చ‌కు తావిస్తుంది. పెను దుమారం రేపుతోంది. కేసీఆర్ ప‌ట్టించుకోక‌పోయినా ప‌ట్టించుకున్న విధంగానే ఉంది. అయితే ఆయ‌న‌కు ప‌ట్టున్న విష‌యాలేంటి? వాటిపై ప్ర‌జ‌ల‌ను ఏ విధంగా ఆక‌ర్షితుల‌ను చేయ‌గ‌ల రు అన్న‌దే ఇప్పుడు ఇంపార్టెంట్ .. అయితే రాజ‌కీయాల్లో చాలా విభిన్నం అయిన వ్య‌క్తిత్వం ఉన్న నాయ‌కురాలిగా మాయావ‌తికి పేరుంది. వివాదాలకు తావిచ్చేలా ఆమె న‌డ‌వ‌డి ఉంటుంద‌ని తెలిసిందే. కార్య‌క‌ర్త‌ల‌తో చెప్పులు మోయించిన దాఖ‌లాలూ ఉన్నాయి.. ఇలాంటి నాయ‌కుల ద‌గ్గ‌ర రాణించడం క‌ష్టం. అయినా ఇప్పుడాయ‌న‌కు త‌ప్ప‌దు.. సున్నిత మ‌న‌స్కులు, బాగా చ‌దువుకున్న వారు మాయావ‌తి ద‌గ్గ‌ర నెగ్గ‌డం అంత సులువు కాదు.. అహంకార భావాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటే నాయ‌కురాలు ఆమె.. ఇక ఆర్ ఎస్ ప్ర‌వీణ్ తెలంగాణ అంతటా బీఎస్పీ భావ‌జాలం ప్ర‌చారం చేసినా ఆ భావ‌జాలానికి ఇప్పుడు అంత ఆక‌ర్ష‌ణ లేదు. ద‌ళిత వాదం ఒక్క‌టే నెగ్గాల‌నుకుంటే మిగ‌తా కులాల మ‌ద్ద‌తూ కావాలి.. అందుకే పాల‌క వ‌ర్గాలూ ఇలాంటి ప‌నులే చేస్తుంటాయి.. రాజ్యంలో అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తూ కూడ‌గ‌ట్టుకుని త‌మ‌కు జ‌రిగిన అన్యాయం ఇది అని చెప్ప‌గ‌లిగితేనే ప్ర‌వీణ్ నెగ్గ‌గ‌ల‌రు.. లేదంటే క‌ష్ట‌మే.. కేవ‌లం అగ్ర‌వ‌ర్ణాల ఆధిప‌త్యాన్ని తిడితే వ‌చ్చేది ఏమీ ఉండదు..ఆయ‌న చెబుతున్న విద్య వైద్య రంగాల‌కు కేటాయింపుల‌పై ఉద్య‌మిస్తే అది ద‌ళితుల‌కు ప్ర‌యోజ‌నం.. అలా ద‌ళిత ఉద్య‌మం పోవాలి.. మ‌ళ్లీ వ‌ర్గీక‌ర‌ణ ర‌గడ కు పోకూడ‌దు.. కానీ ఆయ‌న  ఏం చేస్తారు.. ఎన్నిక‌ల్లో  పోటీ చేస్తారా లేదా కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం అవుతారా అన్న‌ది సందిగ్ధం. మ‌రోవైపు కొన్ని ప్ర‌జా సంఘాలు మాత్రం ఆర్ ఎస్ ప్ర‌వీణ్ తో ప‌నిచేసేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నాయి. అలానే ద‌ళిత‌, గిరిజ‌న ప్రాంతాల‌కు చెందిన ఉపాధ్యాయ సంఘాలు కూడా  ఆయ‌న‌తో ప‌నిచేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నాయి. రాజ్యాధికార‌మే ధ్యేయం అని అనుకుంటారో.. లేదా ప్ర‌భావ శీల‌క ఉద్య‌మాలే శ‌ర‌ణ్యం భావిస్తారో అన్న‌ది  ఇప్పటి మ‌రో సందిగ్ధం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

tg