అమ్మేయండి బాస్ మీకు అడ్డేముంది..మేం ఏం మాట్లాడినా మాకు రాజ‌కీయ రంగు ఉంటుంది.. మీరు మాట్లాడితే ప్ర‌యోజ‌నం ఉంటుంది అదేలేండి దేశ ప్ర‌యోజ‌నం అని ఒక‌టి ఉంది కదా! అది మీదే! మీ వ‌ర‌కే! మీ దేశ‌భ‌క్తి కార‌ణంగా విశాఖ ప్లాంటు అమ్మే యండి ఎవ్వ‌రూ కాద‌నరు కానీ అడిగే వారే ఇక్క‌డ ఏమీ తెలియ‌ని వారు..ఇప్ప‌టికే పెట్టుబడుల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి కొ న్ని విధి విధానాలు ఉన్నాయ‌ని ప్ర‌స్తావించి మ‌రీ! అమ్మేయండి. జేడీ లక్ష్మీ నారాయ‌ణ అడిగినా, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడిగినా ఒక్క‌టే స‌మాధానం..న‌ష్టాల‌ను భ‌రించే శ‌క్తి కేంద్రానికి లేదు అని..   

విశాఖ స్టీల్ హ‌క్కు.. అంద‌రి హ‌క్కు..ఆంధ్రుల హ‌క్కు..మినీ భార‌త దేశాన్ని త‌ల‌పించే ఈ ప్లాంట్ అమ్మేయాల‌ని కేంద్రం భావిస్తే వ‌ద్దు అని ఒక్కొక్క‌రూ కోర్టు మెట్లు ఎక్కుతు న్నారు. త‌మ ప‌రిధిలో  న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏ ప్రాతిప‌దిక‌న అమ్ముతారో అన్న‌ది కూడా తేల్చాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అలా అమ్మేందుకు కుద‌ర‌ద‌ని చెప్పాల‌ని కో ర్టుల‌కు విన్న‌వించుకుంటున్నారు. ఇదే క్ర‌మంలో సీబీఐ మాజీ ఉన్న‌తాధికారి ల‌క్ష్మీనారాయ‌ణ కూడా త‌న వాద‌నను వినిపించేందుకు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై అఫి డ‌విట్ దాఖ‌లు చేసింది కేంద్రం. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్లో భాగంగానే ఆయ‌న హైకోర్టు లో పిటిష‌న్ దాఖ‌లు చేశార‌ని తేల్చింది. ఆయ‌న గ‌తంలో విశాఖ పార్ల‌మెంట్ నుం చి  బ‌రిలో దిగినందున, ఈ విధంగా ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు అడ్డు త‌గులుతున్నార‌ని కూడా చెప్పింది. ప్లాంటు అమ్మ‌కం షురూ చేశాక కేంద్రం చెప్పే కాక‌మ్మ క‌థ‌లు అలా ఇలా లే వులేండి. జేడీ అనే కాదు ఎవ్వ‌రు మాట్లాడినా ఇది ఆర్థిక అంశం అని, ఇప్ప‌టికే దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, కేంద్ర సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఓ ప‌ద్ధ‌తి ఉంద‌ని దానిని తాము తూ.చ‌.త‌ప్ప‌క పాటిస్తున్నామ‌ని చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: