2వేల కొట్ల రూపాయ‌లు ఇస్తే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేసినా.. పార్టీకి గురించి మాట్లాడుతూనే పార్టీకి లైన్‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించినా ఆయ‌నకే చెందుతుంది... ఆయ‌న మ‌రెవ‌రో కాదు కొమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రైన కొమ‌టి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గురించి త‌మ‌కే ఎక్క‌వ‌గా క‌మిట్ మెంట్ ఉందంటూ వ్య‌వ‌హ‌రిస్తారు కూడా. గ‌తంలో పీసీసీ ప‌ద‌వి కోసం కొమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్
పోటీ ప‌డ‌డంతో.. అది కాస్త రేవంత్ రెడ్డి త‌న్నుకుపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఏ మాత్రం అవ‌కాశం దొరికిన రేవంత్‌కు చుర‌క‌లు అంటిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఎప్ప‌టికి ఏదో రకంగా వార్త‌ల్లో నిలిస్తూనే ఉంటారు ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల్లు.

  ఇప్పుడు తమ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని పుల్లెం గ్రామంలో వైఎస్ ష‌ర్మిల నిరుద్య‌గ దీక్ష‌ను చెప్ప‌ట్టారు.  దీన్ని అవ‌కాశంగా భావించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. త‌న పార్టీ చీఫ్ రేవంత్ పై విమర్శలు చేస్తున్న షర్మిలకు రాజ‌గోపాల్ రెడ్డి ఫోన్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగ దీక్షకు తాను కూడా మద్దతు ఇస్తున్నట్లు ఆయ‌న‌ ప్రకటించారు.


  ష‌ర్మిల‌కు ఫోన్ చేసిన  రాజ‌గోపాల్ రెడ్డి నమస్తే షర్మిలమ్మ.. మంచి కార్యక్రమాన్ని చేపట్టార‌ని, మా నియోజకవర్గంలో మీరు నిరుద్యోగుల కోసం ఒకరోజు దీక్ష చేపట్టినందుకు హృదయపూర్వక సంఘీభావం తెలియజేస్తున్నాన‌న్నారు. మేం బతికి ఉన్నంతవరకు రాజ‌శేఖ‌ర్ రెడ్డిని మా గుండెల్లో ఉంటార‌ని చెప్పాడు. మునుగోడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందించేందుకు ఆయ‌న రూ.750 కోట్లతో ప్రాజెక్టు ఇచ్చారు. మీరు సక్సెస్ కావాలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నేను నిరుద్యోగుల తరఫున మీరు తీసుకున్న మంచి కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్నాను అని చెప్పాడు.

    ఉదయమే ఢిల్లీకి వచ్చానని.. లేకుంటే మిమ్మల్నికలిసేవాడినని షర్మిలకు రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా స‌మాచారం. ఆయన మాటలకు స్పందించిన వైఎస్ షర్మిల థ్యాంక్స్ అన్నా.. అని చెప్పినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణల్ని చూస్తే.. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేయటం క‌న‌బ‌డుతోంది. మరోవైపు ఇదే సామాజిక వర్గానికి ప్రతినిధిగా షర్మిల కొత్త‌ పార్టీనే పెట్టారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎటువైపు వెళ్తార‌న్న‌ది  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: