ఒకప్పుడు ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలి అంటే..  పక్క ఇంటివారిని పొరుగింటి వారినో అడిగే వారు.  కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా అవసరానికి ఆర్థిక సాయం కావాలి అంటే ఏకంగా అడగకపోయినా లోన్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం సిద్ధమవుతున్నాయి వివిధ రకాల బ్యాంకుల అంతేకాదు ఫైనాన్షియల్ సంస్థలు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇలా ఫైనాన్షియల్ సంస్థల నుంచి లోన్ తీసుకొని ఇక ప్రతి నెలా కొంత మొత్తంలో ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈఎంఐ చెల్లిస్తున్న వారు అందరూ కూడా ఈ విషయాన్ని దాదాపుగా గమనించే ఉంటారు. మీరు ఈఎంఐ కట్టాల్సిన డేట్ రోజు ఆదివారం వచ్చింది అంటే మీ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ అవి మాత్రం కట్ కావు.



 మరుసటి రోజు అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే   అయితే ఇలా ఎప్పుడైనా ఇక ఈఎంఐ తేదీ ఉన్న రోజు సండే వస్తే ఆ రోజు ఒకవేళ అకౌంట్లో డబ్బులు లేకపోయినప్పటికీ ఇక తర్వాతి రోజు ఉదయం వరకు డబ్బులు ఉండేలా చూసుకుంటూ ఉంటారు చాలా ఉంది  కానీ ఇకనుంచీ అలాంటివి అస్సలు కుదరదు. ఎందుకంటే ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్ అమలులోకి రాబోతుంది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరెన్స్ హౌస్ నిబంధనలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి.  ఇక ఈ కొత్త రూల్ వల్ల ఇక ఈఎంఐ కట్టాల్సిన డేట్ రోజు ఆదివారం ఉన్నప్పటికీ డబ్బులు మాత్రం అకౌంట్ నుంచి కట్ కానున్నాయి.  దీంతో ఈఎంఐ చెల్లించే వారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.



 ఒకప్పటి మాదిరిగానే ఈఎంఐ డేట్ రోజు ఆదివారం వచ్చింది కదా ఇక ఆ రోజు డబ్బులు అకౌంట్లో లేకపోయినా పర్లేదులే  అని కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే చివరికి పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఆగస్టు 1వ తేదీ వరకు ఇక పాత రూల్స్ మాత్రమే కొనసాగుతూ ఉంటాయి. కానీ ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.  ఈ క్రమంలోనే ఆదివారాలు బ్యాంకు హాలిడేస్ ఉన్న సమయంలో కూడా ఈ ఎం ఐ ఏ రోజు ఉంటే ఆ రోజు డబ్బులు అకౌంట్ నుంచి కట్ అవుతాయి. బ్యాంక్ హాలిడే ఉంది కదా ఈ రోజు సండే కదా అని ఎవరైనా ఇక ఈఎంఐ డబ్బులు అకౌంట్లో ఉంచుకోకపోతే మాత్రం ఇక పెనాల్టీ కట్టక తప్పదు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే ఇలాంటి రూల్ వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక అటు బ్యాంకు సెలవులు ఉన్నప్పటికీ ఇక అందరి శాలరీలు  కరెక్ట్ తేదీకి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Emi