ప్రస్తుతం కరోనా వైరస్ భారత దేశాన్ని మొత్తం పట్టిపీడిస్తోంది. రూపాంతరం చెందుతున్న వైరస్ ఇక మరింత ప్రమాదకరంగా మారి పోతుంది. దీంతో దేశ ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుత సమయంలో డాక్టర్లు ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు  ఏకంగా కరోనా రోగుల ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారు   అయితే ఇలా చికిత్స చేస్తున్న క్రమంలోనే ఎంతో మంది వైద్యులు సైతం కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కొత్త వేరియంట్ రూపంలో వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ఏకంగా 13 నెలల వ్యవధిలో మూడు సార్లు వైరస్ బారిన పడింది ఇక్కడ ఒక 26 ఏళ్ళ వైద్యురాలు.




 ఆమెకు మాత్రమే కాదు ఆమె కుటుంబ సభ్యులందరికీ కూడా  కరోనా వైరస్ సోకటం సంచలనంగా మారిపోయింది  ఈ విషయాన్ని ఇటీవలే స్వయంగా బాధితురాలు వెల్లడించింది  అయితే 13 నెలలు సమయంలోనే మూడుసార్లు  వైరస్ సోకటం మాత్రం సంచలనంగా మారిపోయింది.  హల్లరి అనే వైద్యురాలు ముంబైలోని సావర్కర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తోంది  ఈ క్రమంలోనే గత ఏడాది జూన్ 17 వ తేదీన ఆమె వైరస్ బారిన పడింది. ఈ క్రమంలోనే స్వల్ప లక్షణాలు ఉండడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా..  పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ తర్వాత చికిత్స తీసుకుని కోరుకుంది. ఇక ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. కానీ మే 29 తేదీన మరోసారి వైద్యురాలు వైరస్ బారిన పడింది.



 ఆ సమయంలో కూడా ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇక కోలుకున్నారు వైద్యురాలు.  ఇక ఇటీవలే జూన్ 11వ తేదీన మరోసారి ఆమె కరోనా పాజిటివ్ అని తేలింది. ఈసారి వైద్యురాలి తో పాటు ఆమె కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ అని వచ్చింది. ఇలా 13 నెలల వ్యవధిలో మూడు సార్లు కరోనా వైరస్ బారిన పడింది ఆ డాక్టర్.  ఇటీవలే మూడోసారి వైరస్ బారిన పడడం గురించి మాట్లాడిన వైద్యురాలు ఈసారి వైరస్ ఎంతగానో ఇబ్బంది పెడుతుందని తనతో పాటు కుటుంబ సభ్యులంతా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని ఇలా కరోనా వైరస్ టీకా వేసుకున్నప్పటికీ తగిన జాగ్రత్తల పాటించిన్నా వైరస్ మాత్రం పంజా విసురుతుంది అని అందుకే అందరూ ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచించారు వైద్యురాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: