సృష్టిలో ప్రేమ అత్యుత్తమైనదని, దాంతోటే ప్రపంచం నడుస్తుందని పెద్దలు చెప్తుంటారు. అయితే, ప్రేమ గురించి యువతీ యువకులు సరైన అవగాహన చేసుకోవాల్సిన అవసరముంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక ప్రేమలో పడటం ఈజీయేనని సంగతి అందరికీ తెలుసు. కానీ, దానిని తెలపడం అత్యంత కష్టమైన పని. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు దాదాపుగా ఒప్పుకుంటారు. కాగా, ఓ యువతి ప్రేమను పొందడానికి మంచి మనసుంటే చాలని నిరూపించాడు ఓ దివ్యాంగుడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే.

అమెరికాలోని వ‌ర్జీనియాకు చెందిన జోష్ స్మిత్‌ చిన్నప్పుడు ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఇప్పటికీ యాక్టివ్ పర్సనే. అయితే, ఒకనాడు ఫ్రెండ్స్‌తో క‌లిసి స‌ముద్రంలో డైవింగ్ చేస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్‌లో అత‌డి హెడ్, బాడీకి బలమైన దెబ్బలు తగిలాయి. ఫలితంగా నరాలు పని చేయకుండా అయ్యాయి. ఇక జోష్ స్మిత్ అంతకుముందులా ఎప్పటికీ జోష్ ఫుల్‌గా తిరగలేడని, వీల్ చైర్‌కు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని డాక్టర్స్ చెప్పారు. ఈ క్రమంలోనే స్మిత్ కుటుంబీకులు అతడికి అండగా నిలిచారు. జోష్‌కు సెపరేట్ ఫెసిలిటీస్ అవెయిలబుల్‌గా ఉండేలా హౌజ్ కన్‌స్ట్రక్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన ప్రొఫైల్ చూసి అట్రాక్ట్ అయింది గ్రేసీ అనే యువతి. జోష్ స్మిత్ ప్రతీ రోజు రిచ్ మండేకి చర్చ్‌కు వెళ్తాడు. అదే చోటుకు గ్రేసీ వచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. ఆయన మీద ప్రేమ పుట్టడానికి వైకల్యం అడ్డు రాలేదు. జోష్ స్మిత్ కాళ్లు లేవడానికి ఇబ్బంది అయినప్పటికీ అతడు ఒక మోకాలుపైనే నిల్చొని లవ్ ప్రపోజ్ చేశాడు. అది చూసి యువతి మనసు చలించింది. దివ్యాంగుడి లిప్ మీద కిస్ ఇచ్చి మరీ లవ్‌కు యాక్సెప్ట్ చేసింది. దీంతో లవ్ స్టోరీ సుఖాంతం అయింది. ప్రపంచంలో ఒంటి కాలు మీద ప్రపోజ్ చేసిన వ్యక్తి జోష్ ఒక్కడేనని అతడి కుటుంబీకులు గొప్పగా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: