టీడీపీ సీనియర్ నేత, ధూళిపాళ్ళ నరేంద్ర... మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ పై తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలీసులే దగ్గర ఉండి దేవినేని ఉమపై  ప్రత్యక్షంగా, పరోక్షంగా భౌతిక దాడుల్ని ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే పోలీసులు దాడి జరిగే మార్గం వైపు  ఉమా ని దారి మళ్లిoచారు అని విమర్శించారు. పోలీసులు చెప్పిన మార్గంలో వెళ్లినందుకే ఉమపై దాడి జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు. కొందరు పోలీసు అధికారులు వైసీపీ నేతలతో కుమ్మకై చేయించిన దాడి ఇది అని మండిపడ్డారు.

వైసీపీకు పోలీసులు కొమ్ముకాస్తున్నారనేది ఇక్కడ సుస్పష్టమన్నారు ఆయన. రక్షకులే భక్షకులైన పరిస్థితి నిన్న ప్రత్యక్షంగా కనిపించింది అని దీనిపై ఎస్పీ, డీఐజీ సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఐపీఎస్ స్థాయి అధికారులు సైతం దిగజారి అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం అని ధూళిపాళ్ళ విమర్శలు చేసారు. దాడి జరుగుతోందని ఉమకు ముందస్తు సమాచారం ఇచ్చిన పోలీసులు ఎందుకు బలగాలను మోహరించలేదు అని నిలదీశారు. అదే విధంగా తనపై దాడి జరిగిందని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానంటే పోలీస్ స్టేషన్ కు కూడా  ఉమాని రానివ్వలేదు అన్నారు ఆయన.

 ఉమా ను ఫిర్యాదు చేయనివ్వకపోగా తిరిగి ఆయనపైనే భారత శిక్షాస్మృతి లో ఉన్న సెక్షన్లన్నీ పెట్టారు అని ఉమ చుట్టూ పోలీసులు ఉండగా దాడికి యత్నించారనే కేసులు ఎలా పెడతారు అని నిలదీశారు. దేవినేని ఉమపై ఫిర్యాదు చేసిన వ్యక్తిది జి.కొండూరు మండలం కూడా కాదు అని పక్క మండలం నుంచి వ్యక్తులు వచ్చి ఉమపై దాడి చేసేలా సహకరించారు అని విమర్శించారు. ఈ కుట్రను అవకాశం ఉన్న అన్ని వేదికలపైనా ఎండగడతాం అని స్పష్టం చేసారు. అదికారపక్షం అవినీతి,అక్రమాలను ప్రజల దృష్టికి తెచ్చి వారి చర్యలను ఎండగడతాం అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp