పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఈ రోజు తన ఐదు రోజుల ఢిల్లీ పర్యటన మూడో రోజు కాంగ్రెస్ అధ్యక్షు

రాలు సోనియా గాంధీని కలిశారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి నిరంతరం చర్చ జరుగుతున్న తరుణంలో మమత ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెగ సాస్, వ్యవసాయ చట్టం మరియు ద్రవ్యోల్బణం సమస్యల క్రమంలో పార్లమెంట్ నిలిచిపోయింది. ఈ రోజు సోనియా గాంధీని కలవడానికి ముందు, మమతా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యతను సోనియా గాంధీ కోరుకుంటున్నారని మమతా  అన్నారు. 


ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మీద, ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్‌కు నమ్మకం ఉందని వెల్లడించారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి వస్తే బీజేపీ ఓడిపోతుందని మమతా అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడుతూ నేను రాజకీయ జ్యోతిష్కుడిని కాను, అది పరిస్థితి పై ఆధారపడి ఉంటుందని అన్నారు మరొకరు ముందడుగు వేస్తే, దానితో ఎటువంటి సమస్య లేదన్న ఆమె ఎవరైనా నాయకత్వం వహించవలసి ఉందని అన్నారు. 


నేను సోనియా గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌ లను కలుస్తున్నానని, లాలూ యాదవ్ నిన్న ఫోన్‌లో మాట్లాడారని అన్నారు.  "నాకు అందరి పట్ల గౌరవం ఉందని, అదే ప్రతిపక్ష ఐక్యతను సోనియా గాంధీ కోరుకుంటున్నారు" అని ఆమె అన్నారు. దీనితో పాటు, దేశం నరేంద్ర మోడీతో పోటీ పడుతుందని మమత అన్నారు. సోనియాతో పటు మమతా బెనర్జీ ఎన్‌ సి పి అధినేత శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కలవబోతున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ నాథ్, అభిషేక్ మను సింగ్వి, ఆనంద్ శర్మలను మమతా మంగళవారం కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీకి ఇది మొదటి ఢిల్లీ పర్యటన అనే చెప్పాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: