సిద్దిపేట : దుబ్బాక లో బిజెపి ఎమ్మెల్యే  ఉన్న అభివృద్ధి మాత్రం ఆపబోమని మంత్రి హరీష్‌ రావు అన్నారు. దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి హరీష్ రావు చేసారు. ఈ సందర్బంగా దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు తో పాటు , ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

 ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో 3 లక్షల మంది కి రేషన్ కార్డులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో 90.5 శాతం మందికి రేషన్ బియ్యం అందుతున్నాయన్నారు.  రైతులకు 24 గంటల ఉచిత కరెంటు కేవలం తెలంగాణ లోనే ఇస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమానికి చిరునామా తెలంగాణ ప్రభుత్వమని... దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వమని మంత్రి హారీష్‌ రావు అన్నారు.  దళిత బంధు పథకం కొత్తగా రాలేదు.. పోయిన బడ్జెట్ లోనే ప్రవేశపెట్టినామని తెలిపారు.

దుబ్బాక లో ఇదే ఆర్థిక సంవత్సరంలో దళిత కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే రెండు సంవత్సరాలలో దళిత బంధు పథకం పూర్తి చేస్తామని చెప్పిన హారీష్‌ రావు... దుబ్బాక లో ఎమ్మెల్యే బిజెపి ఉన్న అభివృద్ధి మాత్రం ఆపమబోమని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు.  రైతులు ఫామాయిల్ తోటలపై దృష్టి పెట్టాలని... ఆయిల్ ఫాం తోటలకు అన్ని విధాలా సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు మంత్రి హారీష్‌ రావు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎస్‌ పార్టీ వల్లే అవుతుందని తెలిపారు. అందుకు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: