ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టిడిపి నేత దేవినేని ఉమాపై దాడి ఘటన హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. మైలవరం నియోజకవర్గం, కొండపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఆయన బామ్మర్ది అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పి, దేవినేని ఉమా, పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలోనే తమను అడ్డుకుని వైసీపీ నేతలు తమపై దాడి చేశారని చెప్పి ఉమా, టిడిపి నేతలు చెబుతున్నారు.

అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అంటున్నారు. పైగా తమ పైనే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. అయితే ఈ ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు రాష్ట్రం వ్యాప్తంగా టిడిపి నేతలు స్పందించి ఈ దాడిని ఖండించారు. అలాగే వైసిపి ప్రభుత్వం అక్రమాల ప్రశ్నిస్తే దాడి చేస్తుందని ఫైర్ అవుతున్నారు. అయితే టిడిపి నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఈ క్రమంలోనే కొందరు వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారని, కానీ ఉమాకి ఏం జరగకుండా అడ్డుకున్నది కూడా వైసిపి నేతలే అని చెప్తున్నారు.

ఏది ఎలా ఉన్నా ఉమాతో పాటు, పలువురు టీడీపీ నేతలపై దాడులు జరిగిన విషయం వాస్తవమేనని మైలవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ఉమాపై, పలువురు టీడీపీ కార్యకర్తలపై ఎటాక్ చేయడంతో కృష్ణా జిల్లాలోని టీడీపీ నేతలు ఏకమయ్యారు. మొన్నటి వరకు ఉమాకు కొందరు టిడిపి నేతలు యాంటీగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ టిడిపి నేతలు కూడా ఉమాకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య, బాబు రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్ ఇంకా పలు నియోజకవర్గాల టిడిపి ఇంచార్జ్‌లు ఉమా పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.  ఇలా జిల్లా మొత్తం టిడిపి నేతలు ఒకటై ఉమాకి సపోర్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: