వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి పెట్టడం టిడిపికి సాధ్యమవుతుందా? పవన్ కళ్యాణ్ ఏమన్నా జగన్ హవా అని అడ్డుకోగలరా? అంటే ఇప్పుడే చెప్పడం చాలా కష్టమని చెప్పొచ్చు. కానీ టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం కలిస్తే వైసిపికి కాస్త చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్, చంద్రబాబు కలిసి జగన్‌కి చెక్ పెడతారా లేదా అనేది వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాలి.

అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఆ రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా విడివిడిగా పోటీ చేస్తే జగన్‌కే అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో వేరే మార్గం కూడా ఒకటుంది. దానివల్ల పవన్ కళ్యాణ్‌కి కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే వైసిపి, టిడిపి, జనసేనలు విడిగానే పోటీ చేస్తాయి. అయితే ఇక్కడ ప్రధాన పోటీ మళ్లీ టిడిపి, వైసిపి మధ్యే ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ఉండి, పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో కొన్ని సీట్లు తెచ్చుకుని, ఆ రెండు పార్టీలు మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ఉంటే, అప్పుడు పవన్ కళ్యాణ్‌కు అడ్వాంటేజ్ ఉంటుంది.

పవన్ కలిస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలి. అప్పుడు జనసేనకు చాలా ప్లస్ అవుతుంది.  అలాగే పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా మంచి అవకాశాలు కూడా వస్తాయి. అదే సమయంలో సీఎం ఆఫర్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.  కానీ జనసేనఇప్పుడున్న పరిస్థితుల్లో సత్తా చాటడం చాలా కష్టమని చెప్పొచ్చు. గత ఎన్నికల కంటే ఇప్పుడు జనసేన బలం ఇంకా తగ్గినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సైతం పార్టీని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించపోగా, జనసేన నేతలు కూడా ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు జనంలో ఆదరణ ఉండడం కష్టమే. రాబోయే మూడేళ్లలో కూడా జనసేనకు ఇదే పరిస్థితి కొనసాగితే... మళ్లీ ఒకటి, రెండు సీట్లకే పరిమితం కావలసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: