తెలంగాణలో రాజకీయాలన్నీ మారాయని చెప్పవచ్చు. గత ఏడున్నర సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా దూసుకెళ్తూ వస్తోంది. ప్రస్తుత కాలంలో మాత్రం టిఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే  టీఆర్ఎస్ పార్టీలోకి నేతలు చెరడమే తప్ప, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే వివిధ అభియోగాలతో ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరారు. అప్పటి నుంచి  టిఆర్ఎస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త రథసారథి రేవంత్రెడ్డి రావడం. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనే తరుణంలో నేతలందరికీ మింగుడు పడడం లేదని చెప్పవచ్చు.

ఎందుకంటే రేవంత్ వచ్చాక కాంగ్రెస్లో కొత్త ఉత్తేజం మొదలైంది. దీంతో టిఆర్ఎస్ లో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నేతలు అసమ్మతి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే ఈ సమయంలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక రావడం ఈ ఎలక్షన్లలో ఈటల రాజేందర్ ను ఎలాగైనా  ఓడించి, టిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. దీంతో సీఎం కేసీఆర్  వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్ లో ప్రస్తుతం ప్రజలకు ఏ పని కావాలన్నా  చాల తొందరగా అయిపోతుంది అని, 11 వేల పింఛన్లు కూడా అందాయని, అలాగే దళిత బంధు పథకం కూడా అక్కడ మొదలైందని, ప్రభుత్వం నుంచి అందించే ఏ ఫలాలు అయినా హుజురాబాద్ లోనే మొదలు అవుతున్నాయని ఇదంతా ఉపఎన్నిక ప్రభావమే కావచ్చు అని ప్రజలంతా అనుకుంటున్నారు. దీంతో తెలంగాణలోని మిగతా నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంత ఎమ్మెల్యేలను అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి పనులు మొదలు పెట్టింది.

 ఇది గమనించిన తెలంగాణ ప్రజలు  ఎమ్మెల్యేలందరినీ అడ్డుకొని మీరంతా రాజీనామా చేస్తే  మాకు ప్రభుత్వ ఫలాలు అందుతాయని, మీరు ఉండి లాభంలేదని  చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు  ప్రజల మధ్య తిరగాలంటేనే భయం వేస్తున్నట్టు కనబడుతోంది. ఈ విధంగా  హుజురాబాద్ లాగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటూ ప్రజలు అడుగుతున్నారు. హుజురాబాద్ లోనే దళితులు ఉన్నారా మా నియోజకవర్గంలో లేరా అంటూ ఎక్కడికి అక్కడ ప్రజా ప్రతినిధులు నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల అప్పుడు మాత్రమే ప్రభుత్వ పనులు అవుతున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: