క్రిప్టో కరెన్సీలకు ఆదరణ పెరుగుతుండడంతో చాలా దేశాలు డిజిటల్ కరెన్సీని ప్ర‌వేశ‌పెట్టడానికి ప్లాన్‌‌లను వేగవంతం చేస్తున్నాయి. ఇప్ప‌టికే చైనా  ఈ–ఆర్‌‌‌‌ఎంబీ (డిజిటల్‌‌ యువాన్‌‌) పేరుతో డిజిట‌ల్ క‌రెన్సీని తెచ్చింది. సింగపూర్‌‌‌‌, సౌత్‌‌ కొరియా, హాంకాంగ్‌‌లు  కూడా  సెంట్రల్‌‌ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లను పైలెట్ ప్రాజెక్ట్ మోడ్‌లో లాంచ్ చేశాయి.ఆస్ట్రేలియా, యూఎస్‌‌, జపాన్‌‌ వంటి దేశాలు తమ కరెన్సీలను డిజిటల్ రూపంలో తీసుకురావాలని ఆలోచ‌న చేస్తున్నాయి. అదే డిజిట‌ల్ వైపు ఇండియా కూడా అడుగులేస్తోంది.


డిజిటల్ కరెన్సీని ప్ర‌వేశ‌పెట్ట‌డంలో భార‌త్ ఇప్పటికీ ఆలోచన స్టేజ్ వ‌ద్ద‌నే ఉంది. కానీ, మరికొన్నేళ్లలో సొంతంగా డిజిటల్ రూపాయిని తీసుకొచ్చి బిట్‌‌కాయిన్, డోజ్‌‌కాయిన్‌‌, ఎథరమ్‌‌ వంటి ప్రైవేట్‌‌ క్రిప్టో కరెన్సీలకు పోటీ ఇవ్వాల‌ని ప‌థ‌కం ప‌న్నుతోంది. క్రిప్టో కరెన్సీ సెంట్రల్ బ్యాంక్‌‌, కానీ ప్ర‌భుత్వం కంట్రోల్‌‌లో ఉండవు డీసెంట్రలైజ్డ్‌‌గా ఉంటాయి. కాబట్టి వీటిని అదుపులో ఉంచడం చాలా క‌ష్టం. క్రిప్టో క‌రెన్సీ వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ దెబ్బతింటుందని భావించిన‌ చైనా వంటి దేశాలు తమ సొంత వర్చువల్ కరెన్సీని తీసుకొస్తున్నాయి.
 
 చైనా ప్ర‌భుత్వం  2‌‌‌‌016 లో ఎలక్ట్రానిక్ డిజిటల్ కరెన్సీని ప్ర‌వేశ‌పెట్టింది. నాలుగు న‌గ‌రాల్లో షెంజెన్‌‌, సుజౌ, చెంగ్డూ, జియాంగ్‌‌లలో  ఎలక్ట్రానిక్ యువాన్‌‌ను  పైలెట్‌‌ప్రాజెక్ట్‌‌గా లాంచ్ చేసింది.
మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌‌‌‌(ఎంఏఎస్‌‌) 2016 లో ‘యుబిన్’ ప్రాజెక్ట్‌‌ను చేపట్టింది. ఈ చెయిన్ టెక్నాలజీపై 5 దశల్లో ప‌రీక్షించాల‌ని చూస్తోంది.

సౌత్ కొరియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తేవడంపై  ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉంది.  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కొరియా (బీఓకే)  ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్‌‌లో సీబీడీసీపై 22 నెలల పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ను చేపట్టింది. డిజిటల్ యూరోని కమర్షియల్‌‌గా తీసుకురావడంపై యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ కృషి చేస్తోంది. 2016 లోనే డిజిటల్ కరెన్సీ డానిష్‌‌ క్రోన్‌‌ను డెన్మార్క్‌ తీసుకొచ్చింది. కానీ, ఈ–క్రోన్‌‌ను తీసుకురావడం వలన పెద్దగా లాభమేమి లేదని, ప్రస్తుతానికి డిజిటల్ కరెన్సీపై తన ప్లాన్స్‌‌ను క్యాన్సిల్ చేసుకుంది. ఫ్యూచర్‌‌‌‌లో మళ్లీ తీసుకురావొచ్చ‌ని తెలుస్తోంది.

త్వరలో ఇండియాలో భార‌త్‌ కూడా డిజిటల్ రూపాయిని తెస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ దిశ‌గా రిజర్వ్ బ్యాంక్ పనిచేస్తోంది. డిజిటల్ కరెన్సీని దశల వారీగా ప్ర‌వేశ‌పెడుతామ‌ని ఆర్‌‌బీఐ డిప్యూటీ గవర్నర్‌‌ టీ రవి శంకర్ ఇటీవ‌ల‌ ప్రకటించారు. ఇతర దేశాల్లో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని పరిశీలించిన త‌రువాత‌ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ను తీసుకొచ్చేందుకు ఆర్‌‌బీఐ స‌న్నాహాలు చేస్తోంద‌ని అన్నారు. డిజిటల్ రూపాయిపై బిల్లు తేవాలని భార‌త ప్రభుత్వం కూడా ప్లాన్స్ వేస్తోంది.


డిజిటల్ కరెన్సీ వలన నోట్లను ముద్రించే ఖర్చు తగ్గుతుందని రిజ‌ర్వ్ బ్యాంక్ వెల్ల‌డించింది. అంతేకాకుండా, క్రిప్టో కరెన్సీలను ఎదుర్కోవడానికి డిజిటల్ కరెన్సీ ముఖ్యమని ఆర్‌‌బీఐ భావిస్తోంది. సీబీడీసీని తీసుకురావడం వలన మన రూపాయిపై ప్రజల్లో ఆసక్తి తగ్గదని, అంతేకాకుండా క్రిప్టో కరెన్సీలలో ఉండే  వొలటాలిటీ డిజిటల్ రూపాయిలో ఉండదు’ అని ‌  రవి శంకర్ తెలిపారు. త్వరలో రిటైల్‌, హోల్‌సేల్ సెగ్మెంట్‌లో సీబీడీసీ పైలెట్‌ టెస్టింగ్‌ను చేపడతామని  చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: