ఆయనది రాజకీయ కుటుంబం, తండ్రి నుంచి ఆయనకు రాజకీయ వారసత్వం దక్కింది. తండ్రి అప్పలనరసింహం ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. ఇక ఆయ‌న విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు. ఆయన ఇప్పటికి అయిదు సార్లు పోటీ చేసే మూడు సార్లు గెలిచారు.  ఓడినప్పటికీ కూడా ఆయన ఓట్లు మాత్రం భారీగానే తెచ్చుకున్నారు. విశాఖ నగరంలో బలమైన గవర సామాజికవర్గానికి చెందిన గణబాబు మధ్యలో ఒకసారి ప్రజారాజ్యం లోకి వెళ్ళి పోటీ చేసి ఓడారు. ఇక ఆయన 1999, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. 2014లో గెలిచినపుడు ఆయన తనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆయనకు అలాంటి అవకాశం ఇవ్వకుండానే పక్కన పెట్టేశారు.

ఇక 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి జగన్ వేవ్ ని తట్టుకుని మరీ పాతిక వేళ ఓట్ల తేడాతో గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీ విపక్షంలోకి వచ్చేసింది. ఇక వైసీపీ దూకుడు చేస్తోంది. పేరుకు గణబాబు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అక్కడ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ చూసుకుంటున్నారు. ఆయనకు తాజాగా జగన్ రాష్ట్ర ఎడ్యుకేషన్ చైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. దాంతో మళ్ళ మరింత దూకుడు చేస్తారు అంటున్నారు. మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీలో గణబాబు కంఫర్ట్ గా లేరనే చెప్పాలి. ఆయన పార్టీ ఆఫీస్ కి కూడా పెద్దగా వెళ్ళరు, తన నియోజకవర్గం తానేంటో అన్నట్లుగానే  ఉంటున్నారు.

ఇక అధికార వైసీపీని ఆయన పల్లెత్తు మాట అనడంలేదు. అదే సమయంలో ఆయన టీడీపీని సిటీలో భుజాన వేసుకుని గట్టిగా పనిచేయడంలేదు. దీనిని బట్టి చూస్తూంటే గణబాబు వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడుగా ముద్ర పడ్డారు. గంటా సైతం ఇదే విధంగా ఉన్నారు. దాంతో గంటా రూట్ ఎటు అయితే గణబాబు అటే వెళ్తారని అంటునారు. గంటా వచ్చే ఎన్నికల్లో వైసీపీలో చేరి పోటీ చేస్తారు అంటున్నారు. దాంతో గణబాబు కూడా ఫ్యాన్ నీడకు చేరవచ్చు అంటున్నారు. చూడాలి మరి ఈ సీనియర్ ఎమ్మెల్యే కనుక జంపింగ్ చేస్తే పశ్చిమలో టీడీపీకి భారీ షాక్ తగలడం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: