చంద్ర‌బాబు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 40 ఏళ్లు అవుతోంది. 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. పైగా టీడీపీకి రెండున్న‌ర ద‌శాబ్దాల నుంచి అధ్య‌క్షుడిగా ఉన్నారు. అయినా ఆయ‌న ఇప్ప‌ట‌కీ ఏపీలో కొన్ని సీట్ల‌లో స‌రైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టలేని ప‌రిస్థితి. రెండున్న‌ర ద‌శాబ్దాలుగా పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న చంద్ర‌బాబు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌ట‌కీ ఆయ‌న ఆధ్వ‌ర్యంలో పార్టీ జెండా ఎగ‌ర‌వేయ‌లేక‌పోయారు. ఈ లిస్టులో ఏపీలోనే చాలా నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో అప్పుడెప్పుడో టీడీపీ పుట్టిన‌ప్పుడు మిన‌హా ఇప్ప‌ట‌కీ టీడీపీ గెల‌వ‌లేదు.

ఇక ప‌లు ఎంపీ సీట్ల‌లో పార్టీ త‌ర‌పున బ‌లంగా పోటీ ఇచ్చే అభ్య‌ర్థులు కూడా లేని దుస్థితి. ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలు, తిరుప‌తి లాంటి చోట్ల టీడీపీ గెలిచి రెండున్న‌ర ద‌శాబ్దాలు అవుతోంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయిన 22 ఎంపీ సీట్ల‌లో పోటీ చేసిన అభ్య‌ర్థులు చాలా మంది పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఒక‌రిద్ద‌రు చ‌నిపోయారు. కొంద‌రు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేశారు. ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు ఎంపీ సీట్ల‌లో టీడీపీ చివ‌రి సారిగా 1999లో మాత్ర‌మే గెలిచింది.

ఇక ఈ రెండు పార్ల‌మెంటు స్థానాల్లో గ‌త నాలుగు ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఎన్నిక‌కు క్యాండెట్‌ను మారుస్తూనే వ‌స్తున్నారు. ఇక చంద్ర‌బాబును, పార్టీని న‌మ్మి ఎవ్వ‌రూ ఇక్క‌డ సెట్ కావ‌డం లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలులు ఎంపీగా పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు, నెల్లూరులో ఎంపీగా పోటీ చేసి ఓడిన బీద మ‌స్తాన్ రావు ఇద్ద‌రూ కూడా వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక 2014లో నెల్లూరులో పోటీ చేసిన ఆదాల ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉంటే నాడు టీడీపీ ఎంపీగా ఒంగోలులో పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నారు.

దీనిని బ‌ట్టి ఇక్క‌డ పోటీ చేసిన వారు చంద్ర‌బాబును ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదు. ఆయ‌న‌కు స‌రైన నేత‌లు లేర‌నే చెప్పాలి. మ‌రి బాబు క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే అయినా ఇక్క‌డ స‌మ‌ర్థులు అయిన నేత‌ల‌ను సెట్ చేస్తారో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: