ఇటీవలే పాకిస్తాన్ లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రస్తుతం ఉగ్రవాద దేశంగా ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాదుల ను పెంచి పోషించడమే కాదు ప్రపంచ దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటుంది. ఎపుడు భారత్లోకి అక్రమంగా ఉగ్రవాదులను పంపించి మారణహోమాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.  అయితే కేవలం ఉగ్రవాదులతో  మత రాజ్యస్థాపన చేయడమే లక్ష్యంగా అటు పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తూ  ఉంటుంది   కానీ ఇక దేశ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేస్తూ ఉంటుంది.  కనీస అభివృద్ధి జరగగా ఉపాధి లేక మౌలిక వసతులు కరువై ఇక రోజురోజుకు పాకిస్తాన్ ప్రభుత్వ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తిరుగుబాటు దారులుగా మారిపోతుండటం వెలుగులోకి వస్తున్నాయి.



 ఈ క్రమంలోనే ఈ గత కొన్ని రోజుల నుంచి పాకిస్థాన్ లో ఎంతో మంది తిరుగుబాటుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఇక పాకిస్తాన్లో తిరుగుబాటుదారులు రోజురోజుకీ నిరసనలు ఎక్కువ చేస్తుండడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయింది. అంతేకాదు ఇక పాకిస్తాన్ లో చైనీయులు అరాచకాలకు పాల్పడుతూ ఉండడం వారికి అటు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉండడంతో ఇక ప్రజలందరూ మరింత రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే దాడులకు పాల్పడుతున్నారు.  ఇటీవలి కాలంలో పాకిస్తాన్ సైన్యంపై తీవ్రవాదులపై కూడా కొంతమంది తిరుగుబాటుదారులు దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చి సంచలన గా మారిపోయాయ్.


 ఇటీవలే పాకిస్తాన్లో చైనీయుల భద్రత ప్రమాదంలో పడిపోయింది. ఇటీవలే పాకిస్తాన్లో కొంతమంది గుర్తు తెలియని దుండగులు చైనీయుల పై కాల్పులు జరిపి పారిపోయారు  ప్రస్తుతం ఇలా కాల్పుల బారినపడిన బాధితులు కరాచీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంత మంది చైనీయులు భద్రతా బలగాల యొక్క రక్షణ లేకుండానే ఒక పారిశ్రామిక వాడ వైపు వెళుతున్న సందర్భంలో ఇక ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది  ఈ దాడి తర్వాత చైనా విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్తాన్ భద్రతా రంగంపై తమకు పూర్తి నమ్మకం ఉంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే తిరుగుబాటుదారుల ఈ కాల్పులకు పాల్పడి ఉండవచ్చు అని ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: