థాంక్ యూ పెద్దాయ‌న : పిసినారి కేసీఆర్?

లోటులో ఉన్నాం.. అని అనుకోకండి.. ఆ లోటుకు కార‌ణం ఎవ్వ‌ర‌న్న‌ది తెల్సుకోండి.. ఇదీ ఇవాళ్టి ఆలోచ‌న కావాలి మీకు.. ఆదా యంలో ఏ రాష్ట్రంతోనూ పోటీ లేకున్నా అప్పుల్లో మాత్రం ఆంధ్రావ‌ని టాప్ లో తెలంగాణ లీస్ట్ లో ఉండ‌డంతో లిస్టు ప్ర‌కారం కేసీఆర్ స‌ర్ ను పిసినారి అని తేల్చ‌డం అయింది. ఎందుకంటే హుందాగా డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డంలో ఏపీ టాప్ గేర్ లో దూసుకు పో తోంది. అడిగినా అడ‌గ‌కున్నా ప‌థ‌కాల‌కు డ‌బ్బులు ఇస్తోంది. ఈ లెక్క‌న మ‌నం గ‌త ఏడాది క‌న్నా ఎక్కువే అప్పులో ఉన్నాం. కానీ భ‌యం మాత్రం ఈ రాష్ట్ర పాల‌కులకు లేక‌పోవ‌డం విడ్డూరం. ఇప్పుడీ లెక్క‌లు వైసీపీకి చెబితే పాపం వారు మాత్రం ఈ త‌ప్పంతా టీడీపీదే అని అంటారు. ఎందుకంటే వాళ్లు మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్ల మేర బ‌కాయిలు ఉంచి త‌మ‌కు ఖ‌జానాను అందించారు అని చెప్తారు. ఇది విని మ‌నం ఇంకా ఆశ్చ‌ర్య‌పోవ‌డం మిన‌హా చేసేదేం లేదు. వాస్త‌వానికి ఈ త‌ర‌హా ఇబ్బందుల‌కు కార‌ణం ఆదాయం లేక‌పోవ‌డం ఒక‌టి, ప‌న్నుల వ‌సూళ్ల‌లో అధికారుల అల‌స‌త్వం ఇంకొక‌టి కానీ  ఇవేవీ ప‌ట్ట‌ని ప్ర‌భుత్వాల‌కు ఉద్యోగులంటే భ‌యం.. అప్పు అంటే ఇష్టం.. అని అనుకుని స‌ర్దుకుపోవ‌డం మిన‌హా ఈ మ‌నీ మ్యేట‌ర్ ను ఇంత‌కుమించి అర్థం చేసుకోవ‌డం చాలా అంటే చాలా క‌ష్టం.. ఓ విధంగా అర్థం కాదు కూడా!
 
అప్పులు చేయ‌ని రాష్ట్రం ఏమ‌యినా ఉందా? అప్పులు చేయ‌డం అంటే ప‌ప్పులు ఉడికించుకునేందుకే అనే ఊర‌డింపు పాపం ప్ర భుత్వాల నుంచి వినిపిస్తుంది కూడా! మ‌న ఎక‌నామిక‌ల్ స్టేట‌స్ ను నిర్ణ‌యించే అప్పు అంటే కేసీఆర్ కు భ‌యం. అవును! ఇది నిజ‌మే ఆయ‌న జ‌గ‌న్ అంత దూకుడులో ఉండ‌రు.. ఎందుకంటే ఆయ‌న‌కు మ‌రీ ఉచిత ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న చేత‌గాదు. డ‌బ్బులు పంచడంలో జ‌గ‌న్ స‌ర్ క‌న్నా కేసీఆర్ స‌ర్ ఎందుక‌నో వెనుకంజ‌లోనే ఉన్నారు. అందుకే తెలంగాణ అప్పుడు 1,935కోట్లు ఉంటే ఏపీ అప్పు 19,714 ఉంది. ఇది మొన్న‌టి వేస‌వి లెక్క అంటే ఏప్రిల్ నెల‌కు సంబంధించిన లెక్క..  ఈ లెక్క ప్ర‌కారం ఏపీ టాప్ లో ఉంటే పాపం బంగారు తెలంగాణ అప్పుల్లో అప్ప‌ట్లో వెనుక‌బ‌డి పోయింది. ఈ లెక్క‌న మ‌న ఆంధ్ర ప్ర‌దేశం అప్పుల్లో ఎం ఫాస్ట్ గా  ఉందో అంచ‌నా వేసుకోండ్రి.. ఎంత‌యినా మ‌న‌కు ఉన్న  ఉచిత ప‌థ‌కాలు కేంద్రం  ప్ర‌క‌టించే ప‌థ‌కాల క‌న్నా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే రెండు చిన్న రాష్ట్రాల బ‌డ్జెట్ తో స‌మానం క‌నుక ఆ పాటి అప్పు త‌ప్ప‌దు భాయ్. ఏప్రిల్ నాటి లెక్క‌ల అనుసారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌రువాత  కేర‌ళ ఆ త‌రువాత స్థానాల‌లో రాజ‌స్థాన్,  త‌మిళ‌నాడు నిలిచాయి.  ఇక రాబ‌డి చూస్తే ఏపీకి ప‌న్నుల నుంచి వ‌స్తున్న ఆదాయం అంతంత మాత్ర‌మే. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే సీఎం సీరియ‌స్ గానే ఉన్నారు. రాబ‌డి  లెక్క చూస్తే ఏడు వేల ఏడు వంద‌ల
ముప్పై ఎనిమిది కోట్లు అని, కేంద్ర సాయం తో క‌లిపితే ఏపీ ఆదాయం ప‌ద‌కొండు వేల 616 కోట్ల రూపాయ‌లు అని తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: