హుజురాబాద్ ఉప ఎన్నిక..  ఈ ఉప ఎన్నిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలైన ఇంత హాట్ టాపిక్ గా మారిపోయాయో లేదో తెలియదు కానీ హుజురాబాద్ ఉప ఎన్నిక అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను ఊపేస్తుంది.  ఇక పరువుకు పొగరుకు మధ్య జరుగుతున్న ఎన్నిక ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఏమో కానీ..  అటు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎంతో మంచి జరుగుతుంది.  ఎందుకంటే ప్రస్తుతం అధికార పార్టీ ఎన్నో హామీల వర్షం కురిపిస్తూ హుజురాబాద్ ప్రజలందరికీ కూడా వరాలు కురిపిస్తుంది.



 అయితే ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక కెసిఆర్ కి సవాల్ విసిరారు ఈటల రాజేందర్. ఈ క్రమంలోనే కెసిఆర్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు పోటీగా టిఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలోకి దిగబోతోంది అన్న దానిపై మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఎంతో మంది నేతలు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్తగా పార్టీలో చేరిన వారిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.



 అయితే ఒకవేళ ఈటల రాజేందర్ బీజేపీ లోకి వెళ్తే..  బిజెపిలో కొనసాగుతున్న పెద్దిరెడ్డి బిజెపికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో కి వచ్చే అవకాశం ఉందని దీంతో ఇక టిఆర్ఎస్ హుజురాబాద్ ఉప ఎన్నిక టికెట్టు పెద్దిరెడ్డి కి ఇస్తుంది అని అప్పట్లో టాక్ వినిపించింది  ఇప్పుడు అదే జరుగుతుంది కూడా.  ఎందుకంటే ఇటీవల మొన్నటివరకు బిజెపిలో కీలక నేతగా ఉన్న పెద్ధి రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు. ఇక మరికొన్ని రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 30వ తేదీన తన అనుచరులు కార్యకర్తలు అందరితో కలిసి తెలంగాణ భవన్లో కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారూ పెద్దిరెడ్డి. భూములు కాజేసిన ఇతరులను బిజెపి లో చేర్చుకోవచ్చు అని చెప్పినప్పటికీ తన మాట విన లేదని బిజెపి పార్టీ నుంచి బయటకు వచ్చాను అని తెలిపారు. దీంతో ఇక టిఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల టికెట్ పెద్దిరెడ్డి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr