ఏది స‌త్యం ఏది అస‌త్యం ? : తెలంగాణ‌కు కొత్త రాజు?
తెలంగాణ అంతటా గ‌డీలు లేవు.. నాటి మాదిరిగా.. తెలంగాణ అంత‌టా రాజ్యాస్థానాలూ సంబంధిత రాజ్యాధికారాలు లేవు..పోనీ న‌వాబులు ఉన్నారా అంటే లేదు.. కానీ తెర‌పైకి వ‌చ్చిన రాజు... ప‌వ‌ర్ ఫుల్ అని అంటున్నారు కాంగిరేసు పెద్ద‌లు.. ఈయ‌నే రేసు గుర్రం అని పాల‌న ప‌గ్గాల‌ను అందుకోకున్నా తెర‌పైకి రాకున్నా తెర వెనుక న‌డిపేది ఈయ‌నే అని అంటున్నారు వారంతా.. ఇదంతా ఆరోప‌ణ మాత్ర‌మే.. వాస్త‌వాలు ఏంట‌న్న‌ది టీఆర్ ఎస్ తేల్చాలి. కోట‌లో రాజు ఎవ‌రు కోట బ‌య‌ట రాజు ఎవ‌రు అన్న‌ది ప్ర‌జ‌ల‌కు చెప్పాలి.. ఆ బాధ్య‌త ఇంకొంద‌రిది కూడా .. ఎందుకంటే ఆరోప‌ణ‌లు నిరూపించాల్సిన బాధ్య‌త విప‌క్షానిది కూడా !

ఇంకా చెప్పుకుంటే : రాజులు న‌డ‌యాడిన నేల‌పై మ‌రో రాజు.. తెలంగాణ పాల‌న‌లో కొత్త త‌రం రాజు ఒక‌రు వ‌చ్చారు అని వినిపి స్తున్న స‌మాచారం. ఇప్ప టికే దొర‌ల పాల‌న అంటూ ఎద్దేవా  చేస్తున్న‌వారికో క‌ల‌వ‌ర‌పాటు.. ఆర్థిక నేరాల మాటున కాలం గ‌డిపిన స‌త్యం రామ‌లింగ రాజు కొ డుకు సీన్ లోకి వ‌చ్చార‌ని అంటున్నారు ఓ తెలంగాణ కీల‌క ప్ర‌జా ప్ర‌తినిధి. కొత్త రాజు ప్ర‌భావంతో పాల‌న అంతా మారిపో యింద‌ని, ప్ర‌భుత్వ పెద్దలు  కూడా ఆయ‌న చెప్పిన విధంగానే న‌డుచుకుంటున్నార‌ని పెద‌వి విరిచారు. రాజుల పాల‌న లేక‌పోయి నా ఈ గోదా వ‌రి జిల్లాల రాజు ప్ర‌భావం తెలంగాణ‌పై ఉండ‌డ‌మే ఆస‌క్తిదాయ‌కం.


ఎలా అంటే ?:  ఉన్న‌ట్టుండి కొత్త బాంబ్ ఒక‌టి పేల్చారు ఎంపీ కోమ‌టిరెడ్డి.. తెలంగాణ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ కానుంది. ఇంత‌కాలం కేటీఆర్ నే యువ రాజు అనుకుంటే ఆయ‌న‌ను న‌డిపించే రాజు మ‌రొక‌రు వ‌చ్చార‌ని ఆయ‌న ఒక కా మెంట్ ను ఢిల్లీ  మీ డియా ఎదుట పాస్ చేశారు. స‌త్యం రామ లింగ రాజు కొడుకు తేజ రాజు క‌నుస‌న్న‌ల్లోనే కేటీఆర్ ఉన్నార‌ని, ఆ య‌న నిర్ణ‌యాను సారం ఈయ‌న ప‌నిచేస్తున్నార‌ని ఆరోపిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై కేటీఆర్ స్పంద‌న ఎలా ఉండ‌బోతుందో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం.


మరింత సమాచారం తెలుసుకోండి: