అయితే ఇటీవ‌ల తృణ‌ముల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అనుస‌రిస్తున్న విధానాల‌తో రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి ప్ర‌ధానిగా ఉండే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. బెంగాల్ ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌ద‌ళం నేత‌ల‌ను మ‌ట్టి క‌రిపించి ఒంటి చేతితో విజ‌యం సాధించింది. బీజేపీని, అందులోనూ ప్రధాని మోడీని ఎదుర్కొనే విషయంలో ఇంతకాలం ప్రతిపక్షాలు ఎన్ని వ్యూహాలు పన్నినా అవి నీరు గారిపోతూనే వ‌స్తున్నాయి.

 అయితే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఒంటరిగా తన రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొని వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈ విజయమే మమతా బెనర్జీని ప్రతిపక్షాల తరఫున నాయకత్వం వహించేస్థాయికి  తెచ్చిపెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో మ‌మ‌తా దేశ రాజ‌కీయాల్లో అడుగుపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది.  దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ రెండుగా చీలి కొన్ని ఎన్డీయే స‌ర‌స‌న‌ ఉండగా, మరికొన్ని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి గూటిలో చేరుతున్నాయి. ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీలు కూడా 2024 ఎన్నికల నాటికి ఎటో ఒకవైపు చేరక తప్పని పరిస్థితి క‌న‌బ‌డుతోంది.

  అయితే దేశంలో 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చ‌తికిల‌ప‌డిపోయింది. పేరుకే జాతీయ పార్టీ త‌ప్ప ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో త‌న మార్క్‌ను చూపెట్ట‌లేక‌పోతుంది. 2014 సార్వత్రిక‌ ఎన్నికల్లో, రాహుల్ నాయకత్వంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.


 ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో ముందుకుసాగితే ఉపయోగం ఉండదనే అభిప్రాయానికి బీజేపీని వ్యతిరేకించే పక్షాలు వచ్చేశాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై గౌరవాన్ని ప్రదర్శిస్తూనే, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి సీనియర్ నేతల నేతృత్వంలో బీజేపీని ఓడించాల‌ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం పనిచేసిన ఆయన, ఆ వెంటనే మ‌మ‌త‌ను 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎక్కుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp