దేశంలోని మరే రాష్ట్రాల్లో లేని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చుభారీగా పెరిగిపోతోందని చెప్పాలి. ఇక రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎన్నిక వ‌చ్చినా నోట్ల క‌ట్ట‌లు తెగుతున్నాయి. ఏ ఎన్నిక జ‌రిగినా, అభ్య‌ర్థి ఎవ‌రు అయినా కూడా డ‌బ్బులు వెద‌జ‌ల్లేస్తున్నారు. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌ల మీదే ఉన్నాయి. ఏపీలో క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్లో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య మృతి చెంద‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. పైగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో జ‌రుగుతోన్న ఉప ఎన్నిక కావ‌డంతో బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ను అంద‌రూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఇక తెలంగాణలో మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఇప్పుడు ఈట‌ల‌, బీజేపీకి ఇటు కేసీఆర్‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌నుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో డ‌బ్బు మంచినీళ్ల మాదిరిగా ప్ర‌వ‌హించ‌నుంది. ఇంకా చెప్పాలంటే ఈ వ‌ర‌ద ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ఈ డ‌బ్బు పంపిణీలో మిగిలిన పార్టీల క‌న్నా అధికార టీఆర్ ఎస్ కాస్త ముందు వ‌రుస‌లో ఉంది. ఆ పార్టీ ఇప్ప‌టికే సంఘాల వారీగా డ‌బ్బు పంపిణీ ప్రారంభించేసిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇజ్జ‌త్‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక పెద్ద స‌వాల్ కావ‌డంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్ప‌టి నుంచి ఇప్పటివరకు ఏ ఉప ఎన్నిక‌కు ఇవ్వ‌నంత ప్ర‌యార్టీ ఈ ఉప ఎన్నిక‌కు ఆయ‌న ఇస్తున్నారు.

ఈ ఉప ఎన్నిక కోస‌మే కేసీఆర్ ద‌ళిత బంధును తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చారు. ముందుగా దీనిని అక్క‌డే అమ‌లు చేస్తున్నారు. ఇక ప‌లు కుల సంఘాల నేత‌ల‌ను కొనే ప్ర‌క్రియ కూడా ముందుగా టీఆర్ ఎస్ స్టార్ట్ చేసింద‌ని టాక్ ? ఇక ఒక్క టీఆర్ ఎస్ మాత్ర‌మే ఈ ఉప ఎన్నిక కోసం రు. 500 కోట్ల నుంచి రు. 700 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. ఇక బీజేపీ, ఆ త‌ర్వాత కాంగ్రెస్ పెట్టే ఖ‌ర్చు కూడా చూస్తే మొత్తంగా రు. 1000 కోట్ల‌కు పైగా ఇక్క‌డ నోట్ల క‌ట్ట‌లు తెగే ఛాన్సులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

TRS