ర‌చ్చ ర‌చ్చ : అంతా ఆయ‌నే  చేస్తున్నారు!
 
మీరెవ్వ‌రూ త‌గ్గ‌కండి...ప్ర‌జా స‌మస్య‌లు ఎలానూ చ‌ర్చ‌కు రావు క‌నుక మీరంద‌రూ అర‌వండి..గోల చేయండి..స్పీక‌ర్ పోడియం ద‌గ్గ‌ర స‌హ‌నం కోల్పోయి ప్ర‌వ‌ర్తించండి..ఇవ‌న్నీ చేశాకే మీకు ప‌బ్లిక్ లో ఇమేజ్ త‌ప్ప‌క పెరుగుతుంది. అప్పుడు మాత్ర‌మే మీరంతా నాయ‌కులు అని గుర్తిస్తారు జ‌నం.. లేదంటే మీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థకం కావొచ్చు..ఇదీ ఇవాళ్టి రాహుల్ నేతృత్వాన న‌డుస్తున్న నిర‌స‌నల హోరు తీరు.. దేశ అత్యున్న‌త చ‌ట్ట స‌భ‌ల‌లో.. 


చ‌ట్ట స‌భ‌ల‌కు గౌర‌వం తీసుకు రావ‌డం అటుంచితే, ఒకే ఒక్క వివాదంతో కాలం ఎలా గ‌డ‌పాలో అన్న‌ది కాంగిరేసుకు తెలిసిన వి ధంగా ఇంకెవ్వ‌రికీ తెలియ‌దేమో! విష‌య గో ప్య‌త అన్న ఒక్క  అంశంతో రాద్ధాంతం చేయ‌డంలో రాహుల్ ఈ సారి నెగ్గారు. ఆయ‌న నేతృత్వంలోనే ఉభ‌య స‌భ‌లూ ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి. ఆ కార‌ణంగానే వాడీ వేడిగా ఇ రు స‌భ‌లూ జ‌రుగుతున్నాయ్.. వ‌ర్షాకాల స‌మావేశాలలో ఎవ్వ‌రూ త‌గ్గేదేలే అని అంటున్నారు.. ఆ విధంగానే ప్ర‌వ‌ర్తిస్తు న్నారు.  ఆందోళ‌న‌లూ..ఆవేశాల‌తో ఇరు  సభ‌లూ గు రువారం ద‌ద్ద‌రిల్లిపోయాయి.. వాయిదా పడ్డాయి.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు రాజ్య స‌భ తిరిగి స‌మావేశం అయింది. లోక్ స‌భ కూడా ఒక‌సారి వాయిదా పడింది. ఎన్న‌ డూ లేనిది ఘ‌ర్ష‌ణ పూర్వక వాతావ‌ర‌ణంపై ఉప రాష్ట్ర పతి వెంక‌య్య అస‌హ‌నం చెందారు. ముఖ్యంగా ఫోన్ హ్యాకింగ్ పై పెద్ద ర‌గ‌డే న‌డుస్తోంది. అదేవిధంగా రైతు చ‌ట్టాల‌పై కూ డా విప‌క్షా లు గ‌గ్గోలు పెడుతున్నాయి. దీనిపై కేంద్రం దిగి రావాల‌ని ప‌ట్టుప‌డుతోంది. కానీ కేంద్రం మాత్రం త‌న‌దైన స‌మాధానం చె బుతూనే ఉంది..



దీనికి విప‌క్షం వినిపించుకునేలా లేదు. దేశాన్ని కుదిపేస్తున్న  ఈ ఫోన్ హ్యాకింగ్ త‌గాదా ఇప్ప‌ట్లో తేలేలా లేదు. ఈ వ‌ర్షాకాల స‌మావేశాలు అన్నీ ఈ ఒక్క త‌గాదాతోనే కాలం వెళ్లదీసేలా ఉన్నాయి. కాంగ్రెస్ ఎంపీలూ ఈ సారి దూకుడు పెంచి కాగితా లు చింపి స్పీక‌ర్ స్థానంపై వేయ‌డంతో పాటు ప‌లు ప్ల‌కార్డుల‌ను చూపించి త‌మ నిర‌స‌న గ‌ళం పెంచారు. రాహుల్  నేతృత్వాన ఎంపీ లు త‌మ పోరాట ప‌టిమ‌ను పెంచారు.. దీని వ‌ల్ల కాంగ్రెస్ పొందే మైలేజ్ ఎలా ఉన్నా మీడియా దృష్టిని కాంగ్రెస్ ఆక‌ర్షిస్తుందనడంలో ఎటువంటి సందేహ‌మూ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: