ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత ఒకరు దీనిపై తన అభిప్రాయం చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్ కీలక నేత ఒకరు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం గురించి మాట్లాడుతూ బయటి నుండి సలహాదారుగా కాకుండా... పార్టీలో చేరితే మంచి ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

జూలై 22 న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కాంగ్రెస్ అగ్ర నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమల్ నాథ్, మల్లికార్జున్ ఖర్గే, ఎకె ఆంటోనీ, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్, అంబికా సోని, కెసి వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో తన పాత్రకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఒక ప్రణాళికతో ఉన్నారని కూడా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ పార్టీకి విలువను పెంచగలరని తాను భావిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. “ఇది సరికొత్త ఆలోచనలు మరియు వ్యూహాలను తీసుకురావాల్సిన సమయం.

 ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలోకి తీసుకురావడం వల్ల పార్టీ కి ఎటువంటి నష్టం లేదని మరో నేత అభిప్రాయపడ్డారు. 2022 లో జరగనున్న  5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక చర్చ జరగగా... ఉత్తరప్రదేశ్ లో అలాగే పంజాబ్ లో కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేసే ఆవకాశం ఉందని మరో నాయకుడు అభిప్రాయపడినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ప్రశాంత్ కిషోర్ ఏడాది క్రితం బీహార్ అధికార పార్టీ జెడిఎస్ నుంచి బయటకు వచ్చారు. బెంగాల్ లో మమతా బెనర్జీకి తమిళనాడు లో స్టాలిన్ కి ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ కి ఆయన తన వ్యూహాలు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: