ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోో మహిళల భద్రత కోసం ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చి కఠినంగా అమలు చేస్తోంది. ఆకతాయిల ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా పోలీసులను కూడా నియమించింది. అంతే కాకుండా దిశ కాల్ సెంటర్ దిశ యాప్ లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా... కొన్ని ప్రదేశాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దిశ చట్టం తీసుకొచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్న నేరాలు, దాడులు కొంత మేర తగ్గాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. కాగా ఈ దిశ చట్టాన్ని మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దిశ చట్టం సహకారంతో రాష్ర్టంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రులు వివరిస్తున్నారు. ఇక చట్టంపై ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా సరే ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తుంది. కాగా.... ఈ రోజు దిశ వన్ స్టాప్ సెంటర్ ను గుంటూరులో ఏపీ మంత్రులు తానేటి వనిత, హోం మంత్రి సుచరిత కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.... ఎవరైనా అత్యాచారానికి, వేధింపులకు గురైన ఆడవారికి ఈ దిశ వన్ స్టాప్ సెంటర్లో షెల్టర్ కలిపిస్తారని, అంతే కాకుండా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి అవసరమైతే న్యాయ సలహాలు కూడా అందిస్తారని తెలిపారు. ఈ సెంటర్ లో మొత్తం 19 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. కాగా పని చేసుకుంటూ కుటుంబాలను పోషించే వర్కింగ్ ఉమెన్స్ ఇప్పటికీ కొన్ని చోట్ల ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె తెలిపారు. దిశ చట్టం వచ్చిన తర్వాత ఆడవాళ్ల మీద దాడులు తగ్గాయని పేర్కొన్నారు. మరింతగా మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ దిశ వన్ స్టాప్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, దిశ పోలీస్ స్టేషన్ కు ఈ వన్ స్టాప్ సెంటర్ ను అనుసందానిస్తామని ఆమె ప్రకటించారు. ఇక హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.... బాధితులకు అండగా ఉండేందుకు ఈ దిశ వన్ స్టాప్ సెంటర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి జిజిహెచ్ వద్ద దిశ వన్ స్టాప్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: