ఓవ‌ర్ టు హుజురాబాద్ : ఆ మాట‌లు ఎవ్వ‌ర‌న్నా త‌ప్పే!

మ‌నుషులంతా ఒక్క‌టే..మ‌నుషుల రంగూ రూపం  వేరు అంతే! ఈ పాటి సంస్కారం లేకుండా ఏం మాట్లాడినా అంగీక‌రించ‌డం భా వ్యం కాదు. ఎన్నిక‌ల్లో ఓట్లు వేయ‌డం వేయ‌క‌పోవ‌డం అన్న‌దే ప్రామాణికం కాదు అంత‌కుమించి ఓ సామాజిక వ‌ర్గ ఉన్న‌తికి వాటి తో పెన‌వేసుకుపోయిన మ‌రికొన్ని కులాల, వ‌ర్గాల ఉన్న‌తికి కార‌ణం అయ్యేలా నాయ‌కులు ప్ర‌వ‌ర్తించాలి. ప్ర‌య‌త్నించాలి. త‌ప్ప కుండా ద‌ళిత బంధు ప‌థ‌కం అమలు చేయాల్సిందే అని కేసీ ఆర్ భావిస్తే భావించ‌నీయండి కానీ మిగ‌తా వ‌ర్గాల మేలూ ఆయ‌న ఆ శించాలి. అలానే ఈ ప‌థ‌కం గురించి కానీ మిగ‌తా ద‌ళిత సామాజిక‌వర్గాల‌పై మాట్లాడేట‌ప్పుడు కానీ సంయ‌మ‌నం కోల్పోయి మా ట్లాడే నాయ‌కులు ముందున్న కాలంలో త‌గిన  మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. ఓటు బ్యాంకు రాజ‌కీయాలే కీలకం లేదా ప్రామా ణికం అనుకుని కేసీఆర్ తెచ్చిన ద‌ళిత బంధు అర్హుల‌కే అందాలి.ఆ ప‌థ‌కం అమ‌లు కేసీఆరే ప‌ర్య‌వేక్షించాలి.అలానే వివాదానికి తా విచ్చిన ఈటెల బంధువు మ‌ధు సూద‌న్ క్షమాప‌ణ‌లు చెప్పాలి.

అన్ని వ‌ర్గాల హితం కోరేలా రాజ‌కీయ పార్టీలు ఉండాలి..అన్ని వ‌ర్గాల మంచికి పాటుప‌డేందుకు కృషి చేయాలి. కానీ ఓ వ‌ర్గం త‌మ వారని, వారి కోస‌మే తాము అన్న‌ట్లు ఇప్పుడొస్తున్న వివాదాలు కొత్త స‌మ‌స్య‌ల‌కు తావిస్తా యి. అశాంతియుత వాతావ‌రణానికి కార‌ణం అవుతాయి.. కానీ రాజ‌కీయం కోరుకునేదే ఇది అయితే ఎవ్వ‌రం ఏం చేయలేం. ద‌ళిత బంధు ప‌థ‌కంతో  రాష్ట్ర రాజ‌కీయాల ను తీవ్రంగా ప్ర‌భావితం చేసిన కేసీఆర్ కేవ‌లం ఈ ప‌థ‌ కం ఎన్నిక‌ల స్టంట్ అని ఒప్పుకున్నారు కూడా.. దీంతో ప‌లు వ‌ర్గాలు త‌మ అసంతృప్తి ఏంట‌న్న‌ది చెబుతూనే ఉన్నాయి. తాజాగా ఈటెల  మ‌నుషులు ద‌ళితుల‌ను కించ‌ప‌రుస్తూ వ్యాఖ్య‌లు చేశార‌ని వార్త లూ ఈ కోవ‌లోనివే!ఆ మాట‌లు ఎవ్వ‌ర‌న్నా త‌ప్పే!వెనుక‌బ‌డిన సామాజిక వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్యం ద‌క్కేలా చేసేందుకు ఎవ్వర యినా కృషి చేయాలి..ఒక‌వేళ ఆ క్ర‌మంలో కేవ‌లం డ‌బ్బులు వెద‌జ‌ల్ల‌డ‌మే ప్రాధాన్యం అయితే ప్ర‌శ్నించాలి. కానీ నిందాపూర్వ‌క దూష‌ణ‌లు మాత్రం అంగీకారం కాదు..ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మూ కాదు.
 

వాస్త‌వానికి ద‌ళిత బంధు ప‌థ‌కం అటు విప‌క్షంలోనూ ఇటు స్వ‌ప‌క్షంలో కొన్ని వేల త‌ల‌నొప్పుల‌కు కాణం కావొచ్చు. ఎందుకంటే స మాజం అంటే అన్ని వ‌ర్గాలకూ అన్ని కులాల‌కూ మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో సాగేది అని అర్థం. కానీ కేసీఆర్ తీసుకువ‌చ్చిన ప‌థ‌కం కొ న్ని అకార‌ణ ద్వేషాల‌కు తావిచ్చేలా ఉంది. ఏడున్న‌రేళ్ల కాలంలో ఎప్పుడు బై పోల్ వ‌చ్చినా ఏదో ఒక ప‌థకంతో ఊర‌డించే సీఎం కే సీఆర్ ఈ తాజా వివాదానికీ ఓ విధంగా కేంద్ర బిందు వు ఆయ‌నే. అంతా అంటున్న విధంగా ద‌ళితుల‌కు మాత్ర‌మే నిధులు ఇవ్వ డం ఎంపిక చేసిన ల‌బ్ధిదారుల‌కు నేరుగా ప‌దిల‌క్ష‌లు ఇవ్వ‌డం బీజేపీకి స‌హ‌జంగానే క‌ల‌వ‌ర‌పాటు.. ఇది త‌మ గెలుపు అవ‌కాశాల ను దెబ్బ తీస్తుం ద‌ని గ‌గ్గోలు పెట్ట‌డంలో న్యాయం ఉంది.. కానీ ఒక వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడ‌డం స‌బ‌బు కాదు.. ఒక వేళ ఆ వ్యాఖ్య‌లు ఈటెల మ‌నుషులు చేయ‌కుండా ఉంటే ఇంకా మంచిది. కానీ ఈ వివాదం సృష్టించింది కేసీఆర్ మ‌నుషులేన‌ని బీజేపీ ఆరోపిస్తుంది.కానీ ఈ వివాదంను ఎంత వేగంగా ముగించ‌గ‌లిగితే అంత మంచిది. వివాదానికి కార‌ణం ఎవ్వ‌ర‌యినా స‌రే! ప్ర‌జ‌ల మ ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొనేలా ప్ర‌వ‌ర్తించ‌డం భావ్యం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: