ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలోనే జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ స్థాపించడం కూడా ఒకటి. గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం అందించే పథకాలను మరింత చేరువ అవ్వాలి అనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను స్థాపించారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.  అయితే అప్పట్లో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. అటు ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి జగన్ తీసుకున్న నిర్ణయం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ దుమ్మెత్తిపోశారు.


 అయితే  ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం మాత్రం ఎక్కడా గ్రామ వార్డు సచివాలయ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే ఏకకాలంలో 1.23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించి సంచలనమే సృష్టించింది అప్పట్లో ప్రభుత్వం. అంతేకాదు ఇక గ్రామ వార్డు సచివాలయం లో వాలంటీర్లు గా ఎంపికైన వారికి రెండేళ్ల తర్వాత క్రమబద్ధీకరణ చేస్తామంటూ జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో గ్రామ వార్డు సచివాలయం లో పనిచేసే ఉద్యోగులు అందరి సేవలు ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను యూపీలో కూడా తీసుకొచ్చేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు.



 ప్రజా తీర్పు పై మాట్లాడిన వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయం వ్యవస్థను ఇప్పుడు వేరే ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభించినప్పుడు ప్రతిపక్ష టిడిపి పార్టీ ఎంతగానో విషం కక్కింది.  బాబు ఆయన అనుచరులు అందరూ కూడా ప్రజలకు పాలన దగ్గర అవుతూ ఉంటే అదేదో దుర్మార్గం జరిగిపోతున్నట్లు గగ్గోలు పెట్టారు. అయితే ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కూడా యోగి ఆదిత్యనాథ్ జగన్ తరహాలోనే సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చేందుకు నిర్ణయించారని..  ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి చూడాలి అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vsr