సోషల్ మీడియాలో సిక్కోలు పేరు మారుమోగుతోంది. అదేదో యూనెస్కో గుర్తింపు వల్ల కాదు... రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల వల్ల శ్రీకాకుళం జిల్లా పలాస రాజకీయం రసవత్తరంగా మారింది. మంత్రిపై టీడీపీ నేత చేసిన కామెంట్లకు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఘాటుగా బదులిస్తున్నారు. ప్రస్తుతం సిక్కోలులో సోషల్ వార్ హోరా హోరీగా సాగుతోంది.

శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. పొలిటికల్ వార్ లో నువ్వా నేనా అన్నట్లుగా అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అది కూడా ప్రజల మధ్యకు వచ్చి మాత్రం కాదు. అంతా సోషల్ మీడియాలోనే. నువ్వేంత అంటే నీ సంగతి అంతా తేలుస్తామంటూ ఫేస్ బుక్ పోస్టులు పెడుతున్నారు.

వార్ అంతా కూడా టీడీపీ నేత గౌతు శిరీష చేసిన కామెంట్లే కారణంగా కనిపిస్తోంది. రాష్ట్ర పశుసంవర్థక శాఖా మంత్రి, పలాస ఎమ్మెల్యే సిదీరి అప్పలరాజు మీద గౌతు శిరీష చేసిన కామెంట్లకు వైసీపీ నేతలు ఘాటుగానే బదులిస్తున్నారు. మంత్రిపైనా, వైసీపీ కార్యకర్తలపైన చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు. నోరు అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

అసలు ఈ వార్ అంతా కూడా శిరీష చేసిన కామెంట్ల వల్ల వచ్చింది. రెండేళ్లుగా తనను, టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని.... ఇక ఓపిక, సహనం కూడా అయిపోయిందంటూ శిరీష వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెడుతూ... తనను ఇబ్బంది పెడుతున్నారంటూ మంత్రిపైనా, పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరమైన పోస్టులతో తనను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని... వారికి తగిన బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇచ్చారు శిరీష.

ఇప్పుడు సిక్కోలులో సోషల్ వార్ తారాస్థాయికి చేరుకుంది. అసలు ఫేస్ బుక్ లో నిజంగా వాళ్లే పోస్ట్ చేశారో... లేక ఫేక్ అకౌంట్ ద్వారా పోస్టులు పెడుతున్నారో తెలియటం లేదు. ఇటు ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా వివాదాస్పదంగా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: