మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ, టీడీపీ సీనియర్ నేత దేవినేని తాజాగా ఆ మైనింగ్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ ఉమా, టీడీపీ నేతలపై... వైసీపీ నేతలు దాడులు చేశారని వార్తలు వచ్చాయి. కాదు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని కూడా కథనాలు వచ్చాయి. ఏది ఎలా జరిగినా దేవినేని ఉమాపై వైసీపీ దాడి చేసిందనే అంశమే బాగా హైలైట్ అయింది.

ఇక ఇక్కడ విచిత్రంగా ఉమాపై దాడి జరిగితే, పోలీసులు కూడా ఉమాపైనే కేసు పెట్టి, ఆయన్ని అరెస్ట్ చేశారు. దాడి జరిగే సమయంలో ఒక వైసీపీ నేత కారు డ్రైవర్‌ని కులం పేరుతో దూషించారని చెప్పి, దేవినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో పోలీసులు ఉమాని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మరీ విచిత్రం ఏంటంటే...ఆ వైసీపీ నేత కారు డ్రైవర్ కులం, దేవినేని ఉమాకు ఎలా తెలుసు? అనే అంశంలో ఎలాంటి క్లారిటీ లేదు.
కాకపోతే ఏదొక కేసు పెట్టి ఉమాని అరెస్ట్ చేయాలి కాబట్టి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఇది పైనున్న వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుందని టీడీపీ ఫైర్ అవుతుంది. ఇదే సమయంలో కొందరు విశ్లేషకులు గతంలో దివంగత వైఎస్సార్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు.

1996 పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కడప ఎంపీగా బరిలో దిగారు. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండగా, చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్సార్, పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె గ్రామానికి వెళ్లారట. అయితే ఆ గ్రామం అప్పటిలో పక్కా టీడీపీకి అనుకూలమైనదట. వైఎస్సార్ రాగానే, ఆ గ్రామస్తులు ప్రచారాన్ని అడ్డుకుని, ఆయన్ని చుట్టుముట్టి పెద్ద రచ్చే చేశారట. ఆయనపై దాడికి కూడా దిగడానికి చూస్తే, సెక్యూరిటీ అడ్డుకుని వైఎస్సార్‌ని వెనక్కి తీసుకొచ్చేశారట.

దీంతో వైఎస్సార్ వెనక్కి వచ్చేశాక, ఆ గ్రామంలో కొందరు వైఎస్సార్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారట. అసలు గ్రామస్తులే, వైఎస్సార్‌పై దాడికి దిగి, రివర్స్‌లో కేసు పెట్టారు. ఆ విషయంలో పై నుండి ఆదేశాలు లేకపోయినా సరే, లోకల్‌గా ఉండే కొందరు పోలీసులు చంద్రబాబు మెప్పు పొందాలని చెప్పి, వైఎస్సార్‌పై కేసు పెట్టారని గుర్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు దేవినేని మీద రివర్స్‌లో కేసు పెట్టినట్లే, అప్పుడు వైఎస్సార్‌పై కేసు పెట్టారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr