హ‌త్యా రాజ‌కీయాలు మ‌ళ్లీ !

మంచి పాల‌న అందించే క్ర‌మంలో పాల‌కులు త‌ప్పులు చేయ‌రు. పాల‌కులు త‌ప్పులు చేసినా అవి దిద్దుకోగ‌ల‌రు. కానీ ఇప్పుడు కొన్ని స‌వాళ్లు న‌డుస్తున్నాయి. నువ్వా - నేనా అని సాగే ఈ యుద్ధంలో అస్త్రం అధికారం కావ‌డమే అస‌లు స‌మ‌స్య‌. తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా త‌ప్పిదాలు చేయ‌కూడ‌దు. లేదా హ‌త్యారాజ‌కీయాల‌కు ప్రోత్స‌హించ‌కూడ‌దు. కానీ అవ‌న్నీ చేసేది మీ రంటే మీరు అని ఇరు పార్టీలు తిట్టుకుంటున్నాయి. లేదా ఒక‌రిపై ఒక‌రు అనుమానాలు వ్య‌క్తం చేసుకుంటున్నాయి.


భ‌యం ఆందోళ‌న‌లో
.......టీడీపీ క్యాడ‌ర్

 
ఉమా అరె స్టు, జైలుకు త‌ర‌లింపు అనంత‌రం వ‌చ్చిన అనుమానాలు టీడీపీవి. రాజారావు అనే జైళ్ల శాఖ అధికారిని బ‌దిలీ చేయ డం వెనుక ఏవో కార‌ణాలు ఉన్నాయి అని, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిని గ‌తంలో ఇలానే జైల్లోనే హ‌త‌మార్చిన దాఖ‌లాలు ఉన్నాయ‌ని అ చ్చెన్నాయు డు త‌న త‌ర‌ఫున వినిపిస్తున్న వాద‌న. దీంతో తెలుగుదేశం శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్నాయి. త‌మ నేత‌కు ప్రాణ హాని ఉందా అని ఆరా తీస్తున్నాయి. ఇప్ప‌టికే కొంద‌రు నాయ‌కులను టార్గెట్ చేసుకుని వైసీపీ త‌న ప‌గ‌నూ పంతాన్నీ నెగ్గించుకున్న ఉదంతాలు ఉండ‌డంతో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్య‌వ‌ర్గం ఉలిక్కి ప‌డుతోంది. ఏ క్ష‌ణాన ఏ నిర్ణయం వ‌స్తుందో అని భ‌య ప‌డుతోంది. దీనిపై తాము అప్ర‌మ‌త్తం అయి ఉన్నామ‌ని అచ్చెన్న లాంటి నాయ‌కులు చెబుతున్న మాట.

ఎట్ ద ఎండ్ పాయింట్
.........చెప్పొచ్చేదేంటంటే


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ హ‌త్య‌లు, హ‌త్యా రాజ‌కీయాలు లేవు.. అని  చెప్ప‌గ‌ల‌మా! ఇంత పెద్ద ప్ర‌శ్న‌కు ఆశ్చ‌ర్యార్థ‌కాన్ని కాప‌లా గా ఉంచాను. ఎందుకంటే ఏపాటి పూర్వ జ్ఞానం ఉన్నా ఇలా ఆశ్చ‌ర్యార్థ‌కం ఉంచుతారా! ప్ర‌త్య‌ర్థి బ‌ల‌వంతుడు అయితే ఏం చేస్తారు.. ఆ స్తుల‌పై దాడులు చేస్తారు..ఇంకా చేత‌గాక‌పోతే ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటారు. అంత‌టి కోపాలు మ‌న ద‌గ్గ‌ర ఉన్నాయా! మ‌ళ్లీ ఆశ్చ ర్యార్థ‌క‌మే కాపాలా ఉంచి స‌మాధానం వెత‌కాలి. ఏమో! ఏమ‌యినా ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రంలో మ‌ళ్లీ అలాంటివి జ‌ర‌గ‌వ‌చ్చు అన్న ది టీడీపీ అనుమానం మరియు ఆందోళ‌న. అలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండాల‌న్న‌ది నాలాంటి సామాన్యుల వేడుకోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: