పెళ్లిరోజున భార్యకు ఎవరైనా.. ఏ చీరో.. గాజులో.. లేక నగలో కొనిస్తారు.. కానీ ఓ భర్త మాత్రం భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. బుల్లెట్ ను సర్ ప్రైజ్ ఆమె కళ్లముందుంచాడు. ఇంకేముందీ ఆ భార్య ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఎగిరి గంతేసింది. మగవాళ్లే అతికష్టంగా నడిపే ఆ భారీ బైక్ ను నేర్చుకోవాలని ఆశపడింది. ఎంతో శ్రద్ధగా నేర్చేసుకుంది కూడా. అంతటితో ఆగలేదు.. ఆ బైక్ పై రయ్యరయ్యమని దూర ప్రాంతానికి వెళ్లాలని ఆరాటపడింది. భర్త కూడా అందుకు అంగీకరించడంతో... వెంటనే తన కూతురిని కూడా వెంట పెట్టుకొని బయల్దేరింది. ఆ టూర్ ఎక్కడికో కాదు.. కాశ్మీర్ కు. అంతేకాదు ఆ ఇద్దరూ తమ ప్రయాణంలో తీసుకునే జాగ్రత్తలను కనిపించే వారితో చెబుతూ ముందుకు సాగుతున్నారు.

కేరళ రాష్ట్రంలోని మణియారాలో నివసిస్తున్న అనీష.. ఒక ఉపాధ్యాయురాలు. అక్కడే ఓ స్కూల్ లో టీచర్ గా విధులు నిర్వర్తిస్తోంది. భర్త ఎంతో ప్రేమగా కొనిచ్చిన బైక్ పై చక్కర్లు కొట్టాలనుకుంది. అనుకున్నదే తడవుగా కేరళ రాష్ట్రం నుండి కాశ్మీర్ హద్దుగా తన ప్రయాణం ప్రారంభించింది. అంతేకాదు అనీష.. తన గారాల పట్టి మధురిమతో కలిసి ఎంచక్కా ఆ బైక్ పై బయల్దేరింది. మధురిమ ప్ర్తుతం డిగ్రీ చదువుతోంది. జూలై 14వ తేదీన ఈ ఇద్దరి ప్రయాణం ప్రారంభమైంది. అయితే రోజుకు 300కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తూ.. జర్నీలో ఎంజాయ్ మెంట్ ను చూస్తున్నారు తల్లీకూతుళ్లు.


దాదాపు రెండు వారాల పాటు తమ ప్రయాణం కొనసాగింది. అయితే ఈ జర్నీలో తమకు ఎదురైన సమస్యలు.. అంతేకాదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై సామాజిక మాద్యమాల్లో పంచుకుంటున్నారు ఈ ఇద్దరు. స్త్రీలు సింగిల్ గా ప్రయాణించేటపుడు తమ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెబుతున్నారు. ఏ మహిళ అయినా తాము నిర్దేశించుకున్న గమ్యానికి చేరుకోవాలనే తపనతో ప్రయాణిస్తున్నపుడు.. రాత్రి కాకముదే ఏదో ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవాలని అంటున్నారు. తమ భద్రత కోసం సేఫ్టీ యాప్ లు, పెప్పర్ స్ర్పేలు లాంటివి దగ్గర ఉంచుకోవాలంటున్నారు. మనము కూడా ఈ తల్లీకూతుళ్లకు హ్యాపీ జర్నీ చెబుదాం.


మరింత సమాచారం తెలుసుకోండి: